»   » ఆలీ పెళ్ళి అలా మర్చిపోలేని ఙ్ఞాపకం అయ్యింది : కోటా ఇలా చెప్పాడు

ఆలీ పెళ్ళి అలా మర్చిపోలేని ఙ్ఞాపకం అయ్యింది : కోటా ఇలా చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జీవితాల్లో కొన్ని సందర్భాలు విచిత్రంగా ఉంటాయి. కొన్ని విషాదాలు కూడా అవ్వొచ్చు..మరికొన్ని మాత్రం అద్బుతమైన ఙ్ఞాపకాలని అందిస్తాయి. అలాంటి సందర్భాలు అందరి జీవితాల్లోనూ ఉండొచ్చు కానీ. సెలబ్రిటీల విషయం లో కాస్త ఆసక్తి కరంగా ఉంటాయి. అలాంటి విషయమే నటుడు కోటా శ్రీనివాసరావు చెప్పారు.

దర్శకుడు రాఘవేంద్ర రావు

దర్శకుడు రాఘవేంద్ర రావు

అయితే ఇది ఆయన విషయం కాదు సహనటుడు ఆలీ ది. ఎన్నో ఏళ్ళుగా ఇద్దరూ చాలా సినిమాల్లో నటించారు. కోటా ఆ సినిమా ఏదో పేరు చెప్పలేదు గానీ ఆ సందర్భాన్ని మాత్రం చెప్పారు. ఇంతకీ ఆ సంగతేమిటంటే. ఒక సినిమా లో దర్శకుడు రాఘవేంద్ర రావు గారికి ఒక చిక్కువచ్చి పడిందట.

 ఆర్టిస్టు సెట్‌కు రాలేదు

ఆర్టిస్టు సెట్‌కు రాలేదు

ఓ పెద్ద ఆర్టిస్టు అనుకున్న ప్రకారం సెట్‌కు రాలేదు. ఆయన కోసం షూటింగ్ వాయిదా వేయాలనుకుంటే మిగతా ఆర్టిస్టుల డేట్ల విషయం లో తేడా వస్తుంది. నిర్మాతకి లక్షల్లో నష్టం. షూటింగ్ కూడా లేటయిపోతుంది. ఈ సమస్య లో సతమతమౌతున్న రాఘవేంద్ర రావు గారికి. గుర్తొచ్చిన నటుడు. కమేడియన్ ఆలీ.

కొద్ది సేపటి ముందే పెళ్ళయ్యింది

కొద్ది సేపటి ముందే పెళ్ళయ్యింది

వెంటనే ఆలీకి ఫోన్ కలపమన్నారు. అయితే అక్కడ ఆలీ ఉన్న పరిస్థితి వేరు. అంతకు కొద్ది సేపటి ముందే తనకి పెళ్ళయ్యింది ఇంకా ఆ ఏర్పాట్లలోనే ఉన్నారంతా. అంతే కాదు ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెళ్ళయిన రోజు సాయంత్రమే ఫస్ట్ నైట్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఆ ఏర్పాట్లలో ఉన్నారట. అదే విషయాన్ని రాఘవేంద్ర రావు గారికి చెప్పేసాడు ఆలి.

నువ్వు మీ ఆవిడతో కలిసి ఫ్లైటెక్కు

నువ్వు మీ ఆవిడతో కలిసి ఫ్లైటెక్కు

అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ని కూడా చెప్పిన రాఘవేంద్ర రావు గారు. ముందు నువ్వు మీ ఆవిడతో కలిసి ఫ్లైటెక్కు అని చెప్పేసారట. ఇక్కడ పెళ్ళి అక్కడ పెద్ద దర్శకుడి నుంచి అంత అర్జెంట్ పిలుపు.ఆయన అంత అత్యవసరంగా రమ్మన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతూనే ఉంది...

 స్టార్ హోటల్లో

స్టార్ హోటల్లో

భార్యతో కలిసి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్‌లో దిగాడు ఆలీ. వెంటనే సాయంత్రానికల్లా ఆలీతో షూటింగ్ చేయించి.. ఆ రాత్రికి హైదరాబాద్ లోనే ఒక స్టార్ హోటల్లో అతడికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయించాడు రాఘవేంద్రరావు. తన సినిమా కోసం పని చేసే ఆర్టిస్టుల్ని రాఘవేంద్రరావు ఎలా చూసుకుంటారనడానికి ఇది ఒక ఉదాహరణ'' అని చెప్పారు కోటా.

English summary
In a latest interview Senior Actor of Tallywood Sri Kota Srinivasa Rao Sahred some insident About Director Raghavender Rao And Actor Ali
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu