ఛీటింగ్ కేసులో బడా నిర్మాత అరెస్ట్

64 సంవత్సరాల వయస్సు గల మొహల్ కుమార్...తిరంగ,క్రాంతివీర్ వంటి బ్లాక్ బస్టర్స్ ని అందించి పరిశ్రమలో బడా నిర్మాతగా పేరొందిన వారు. జుహూలోని పెన్ ఫిల్మ్ కంపెనీ 2000 సంవత్సరంలో నిర్మాత మొహుల్ కుమార్ చిత్ర నిర్మాణం నిమిత్తం రూ.ఆరు కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అయితే ఆ మొత్తాన్ని జాంనగర్‌లోని ఒక మల్టిప్లెక్స్‌లో పెట్టుబడిగా పెట్టారు.
12 ఏళ్ల తరువాత మొహుల్ కుమార్‌పై కంపెనీ జుహూ పోలీసులకు ఫిర్యాదు నమోదు చేసింది. ముందస్తు బెయిల్ కోసం కుమార్ పెట్టుకున్న అభ్యర్థనను సెషన్ కోర్టు తిరస్కరించింది. అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అభియోగపత్రం దాఖలు చేసేటప్పుడు కోర్టుకు హాజరు కావాలని ఆయనను ఆదేశించింది.


Click it and Unblock the Notifications











