»   » హృదయంతో ఆలోచించడం వల్లే అల్లు అర్జున్...

హృదయంతో ఆలోచించడం వల్లే అల్లు అర్జున్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హృదయంతో ఆలోచించడం వల్లే బన్ని (అల్లు అర్జున్) ఈ సినిమా చేశాడు. మనోజ్ ఎనర్జీ సినిమాకి ప్రాణమైంది. అమ్మలాంటి మంచి మనసుతో అనుష్క ఈ సినిమా చేసింది అంటూ దర్శకుడు క్రిష్ చెప్పుకొచ్చారు. ఆయన తాజా చిత్రం 'వేదం' జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయానికి మీడియాకు తెలియచేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే చిత్రం కథ గురించి చెబుతూ...గొంగళిపురుగుల్లా ఉన్న కొంతమంది వ్యక్తులు సీతాకోకచిలుకలుగా మారడమే ఈ 'వేదం'అన్నారు.అ లాగే ఈ చిత్రానికి కీరవాణి సమకూర్చిన అద్భుతమైన సంగీతం, ఆయన స్వయంగా రాసిన నాలుగు పాటలు సినిమాకి ఎస్సెట్.టెక్నీషియన్లు ఈ సినిమాకి బలమయ్యారు అని ఆయన చెప్పుకొచ్చారు.ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ప్రసాద్ దేవినేని, శోభు యార్లగ డ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అయిదు పాత్రల చుట్టూ నడిస్తుంది.

అయిదు పాత్రలతో, అయిదు కథలతో సరదాగా సాగే విభిన్న చిత్రం ఇది. అల్లు అర్జున్ ఒక కథ, మనోజ్‌ది ఒక కథ, అనుష్కది ఒక కథ, మనోజ్ వాజ్‌పాయ్‌ది మరో కథ..ఇలా ఉంటుంది సినిమా. మనోజ్, అల్లు అర్జున్ కలిసి పాల్గొనే సన్నివేశాలు క్లైమాక్స్ లో ఉంటాయి. రియలిస్టిక్ ఎప్రోచ్ కలిగిన హ్యుమన్ డ్రామా ఈ సినిమా దీనిని వర్ణిస్తున్నారు. ఇక అనుష్క ఇందులో సరోజ అనే వేశ్యగా కనిపంచనుంది. అలాగే అల్లు అర్జున్...స్లమ్ లో తిరిగే మాస్ కుర్రాడుగా ఉంటాడు. మనోజ్ ఓ రాక్ స్టార్ గా ఉంటాడు. అలాగే అల్లు అర్జున్ పక్కన దీక్ష సేధ్ నటిస్తోంది. దాదాపు 40 నిమిషాల నుంచి గంట సేపుంటుంది అల్లు అర్జున్ పాత్ర..ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu