పూరీ కి మెగా ఫ్యామిలీ ట్విస్ట్...క్రిష్ కు ప్లస్

By Srikanya

Krish to direct Varun Tej debut film
హైదరాబాద్ : పూరీ జగన్నాథ్ కు మెగా ఫ్యామిలీ ట్విస్టు ఇచ్చిందా...నిజమే అంటున్నారు సిని జనం. పూరీ దర్శకత్వంలో నాగబాబు కుమారుడు వరుణ్‌ హీరోగా పరిచయమయ్యేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఏమైందో ఏమో సీన్ లోకి ఊహించని విధంగా దర్శకుడు క్రిష్ వచ్చాడు. పవన్ మీద పూరీ చేసిన వ్యాఖ్యల ఫలితమే ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నారనగానే అందరిలో ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఎవరై ఉంటారుఅనేది మొదటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. మొదట శ్రీకాంత్ అడ్డాల ని అనుకున్నారు. కాని పర్శనల్ కారణాల వల్ల అతను తప్పుకోవటంతో పూరీ ని అనుకున్నారు. పూరీ వెళ్లి స్టోరీ నేరేట్ చేసారని కూడా వినపడింది. అయితే అనుకోని విధంగా ఈ మార్పు జరిగింది. అందుకే పూరీ హడావిడిగా నితిన్ తో హార్ట్ ఎటాక్ అనే చిత్రం ప్రకటించాడని అంటున్నారు.

ఇక రామ్‌చరణ్‌ని తెరపైకి తీసుకొచ్చిన వైజయంతి మూవీస్‌ ద్వారానే వరుణ్‌ తెరంగేట్రం జరగబోతోంది. ఈ సినిమాకి రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) దర్శకత్వం వహిస్తారు. సి.అశ్వనీదత్‌ నిర్మాత. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. స్విట్జర్లాండ్‌, లండన్‌ల్లో కీలక సన్నివేశాల్ని రెండు నెలలపాటు చిత్రీకరిస్తారు.

ఆ తరవాత హైదరాబాద్‌, ముంబయిల్లో కొంతమేరకు షూటింగ్‌ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ కు స్థానం ఉంది. త్వరలో ఎంపిక చేస్తారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తారు. రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు. ఈ సినిమాకు పలువురు బాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు పని చేస్తారు. క్రిష్‌తో వైజయంతి మూవీస్‌ మూడు చిత్రాలు చేస్తుంది. అందులో మహేష్‌బాబుతో చేసే 'శివమ్‌' ఒకటి. ఆ చిత్రం వచ్చే యేడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X