»   » వరుణ్ సినిమా చరణ్ కి ఎలా...!? క్రిష్ చేయబోయే స్పై థ్రిల్లర్ లో రామ్ చరణ్??

వరుణ్ సినిమా చరణ్ కి ఎలా...!? క్రిష్ చేయబోయే స్పై థ్రిల్లర్ లో రామ్ చరణ్??

Posted By:
Subscribe to Filmibeat Telugu

తొలి సినిమాతోనే ప్రతిభను చాటుకున్న అరుదైన దర్శకుల చెంత 'గమ్యం'తోనే చేరిపోయాడు క్రిష్. జాగర్లమూడి రాధాకృష్ణ కాస్తా సినిమాపిచ్చితో క్రిష్‌గా మారిపోయాడు. అతనిలోని తపనను గుర్తించిన తండ్రి సాయిబాబు తానే నిర్మాతగా మారి 'గమ్యం' చిత్రాన్ని నిర్మించారు. మొట్టమొదటి చిత్రం 'గమ్యం'తోనే క్రిష్ ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించాడు. 'గమ్యం'లో క్రిష్ ఎంచుకున్న కథ, దానిని నడిపించిన తీరు జనాన్ని బాగా ఆకట్టుకుంది.

తొలి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా నందిని అందుకున్న క్రిష్ మలి చిత్రం 'వేదం'లోనూ వైవిధ్యం ప్రదర్శించాడు... ఈ సినిమా సైతం క్రిష్‌కు అవార్డులూ, రివార్డులూ సంపాదించి పెట్టింది..., మెగా ఫ్యామిలీ నుంచి రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'కంచె' ఇటు విమర్శకుల ప్రశంసలను, బాక్సాఫీస్ కలెక్షన్లనూ వసూలు చేసి మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలో మొదటిసారి రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన మొదటి సినిమాగా వార్ జానర్‌లో రూపొందిన ఈ సినిమా క్రిష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ వెంటనే బాలకృష్ణ తో చేసిన గౌతమీ పుత్ర శాతకర్ణి ఏ రెంజ్ లో ప్రభంజనం సృష్టిస్తూందో చూస్తూనే ఉన్నాం. ఈ ఒక్క సినిమా క్రిష్ రేంజ్ ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు క్రిష్ తో సినిమా కొసం టాలీవుడ్ వరుస కట్టబోతోంది. ఇప్పుడు హాట్ టాపికి క్రిష్ తర్వాత చేయబోయే సినిమా ఏమిటనే....

 Krish Rayabari with Ram Charan

క్రిష్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమా చేయబోతున్నాడనే టాక్ తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇటీవల ఒక సందర్భంలో చరణ్ చెప్పిన మాటలు అందుకు కారణమయ్యాయి. సుకుమార్ ప్రాజెక్టు తరువాత మరో రెండు సినిమాలను అంగీకరించాననీ, అందులో ఒకటి స్పై థ్రిల్లర్ గా ఉంటుందని అన్నాడు. ఇందులో విశేషం ఏంటంటే ఈ సినిమా కూడా వరల్డ్ వార్ ఈఈ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. కాకపొతే కంచెలో హీరో సనికుడిగా కనబడితే ఇప్పుడు మాత్రం గూఢచారి గా (స్పై) కనిపిస్తాడట..

గతంలో క్రిష్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా 'రాయబారి' సినిమా చేయాలనుకున్నాడు. కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. అదే కథను ఆయన చరణ్ తో చేయనున్నాడని చెప్పుకుంటున్నారు. అదేం కాదనీ .. చరణ్ చేయనున్న స్పై థ్రిల్లర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం లోనిదని మరి కొంతమంది అంటున్నారు. ఈ ఇద్దరిలో చరణ్ ఎవరితో సినిమా చేయనున్నాడనేది త్వరలోనే తెలిసే ఛాన్స్ ఉంది. ఇంతకీ వరూన్ తో చేయాల్సిన సినిమా చరణ్ చేతికెలా? ఎందుకు వచ్చిందబ్బా??

English summary
According to the sources Rayabari the craziest project which was Planed and Cancelled by Krish with Varun Tej as hero is Now Ready To go on the sets But Now the Hero is Ram charan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu