twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'క్రిష్' తెలుగు అన్ని థియోటర్లలలోనా

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఫిల్మ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తున్న సినిమా 'క్రిష్-3'. రాకేష్ రోషన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. నవంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమాను సర్కార్ జిల్లాల్లో, సీడెడ్‌లో ఏషియన్ మూవీస్, కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి.దాదాపు 250-300 థియేటర్లలో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఓ హిందీ సినిమాను తెలుగులో ఇన్ని థియేటర్లలో విడుదల చేయడం ఇదే తొలిసారి.

    దీనికి సంబంధించి ఏషియన్ మూవీస్ నారాయణదాస్ నారంగ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ "క్రిష్ సీరీస్‌లో ఇది మూడో సినిమా. తొలి రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో బాగా తెలుసు. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చిన సినిమా ఇది. దాదాపు 250-300 థియేటర్లలో తెలుగులో విడుదల చేస్తున్నాం. ఓ హిందీ సినిమాను తెలుగులో ఇన్ని థియేటర్లలో విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. రాకేష్ రోషన్ గత సినిమాలన్నీ ప్రజాదరణ పొందినవే. ఈ సినిమా కూడా తప్పకుండా అందరినీ మెప్పిస్తుంది.

    గత చిత్రాలతో పోలిస్తే క్రిష్ 3లో సాంకేతిక పనితనం గొప్పగా ఉంటుంది. హాలీవుడ్ సినిమాతో పోలుస్తున్నారు. కళ్లను మిరుమిట్లు గొలిపే గ్రాఫిక్స్ ఉంటాయి. పిల్లలకు నచ్చే ఫీట్లు అమితంగా ఉంటాయి. హృతిక్ రోషన్ చాలా బాగా చేశారు. ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. వాటికి రీచ్ అయ్యే విధంగా ఉంటుంది సినిమా. పాటలు కూడా చాలా బావున్నాయి. అయినా ఈ సినిమాలో పాటలకన్నా మిగిలిన వాటిమీద అందరూ ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. సకుటుంబంగా చూసేలా సినిమాను తీర్చిదిద్దారు. ఎక్కడా వల్గారిటీ ఉండదు. ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ నాయికలుగా నటించారు. ఆద్యంతం కట్టిపడేసేలా ఉంటుంది సినిమా. రిపీట్ ఆడియన్స్‌తో థియేటర్లు కిటకిటలాడుతాయనే నమ్మకం ఉంది. తెలుగులో మాత్రం రూ.10కోట్లను మించిన వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నాం'' అని అన్నారు.

    గతంలో రాకేష్ నిర్మించిన 'క్రిష్', 'ధూమ్ 2' తెలుగు,తమిళ భాషల్లో అనువాదం చేయగా హృతిక్‌కు మంచి ఆదరణ లభించింది. బాలీవుడ్‌తో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో కూడా హృతిక్‌కు భారీగా '్ఫ్యన్ ఫాలోయింగ్' ఏర్పడింది. గతంలో తాను నిర్మించిన 'క్రిష్'ను ప్రతి భారతీయుడు ఆస్వాదించాలన్న తపనతో డబ్బింగా చేయించి ఇతర భాషల్లో విడుదల చేయించినట్లు రాకేష్ గుర్తు చేస్తున్నాడు. దక్షిణాది ప్రేక్షకులూ తన సినిమాలను ఆదరించడం ఎంతో ఆనందం కలిగించిందని అంటున్నాడు. 'క్రిష్ 3'ని అనువాదం చేసి ఎప్పుడు విడుదల చేస్తారని దక్షిణాదికి చెందిన సినీ పంపిణీదారులు తనను పదే పదే అడుగుతున్నారని తెలిపాడు. కన్నడ, మలయాళం కంటే తెలుగు, తమిళ భాషల్లో సినీ పరిశ్రమ బాగా విస్తరించిందని అంటున్నాడు. వాణిజ్యపరమైన కోణంలో ఆలోచించినా అనువాద చిత్రాలకు దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉందని రాకేష్ విశే్లషిస్తున్నాడు. 'ఫిల్మ్ క్రాఫ్ట్' పతాకంపై రాకేష్ దర్శక, నిర్మాతగా రూపొందించిన 'క్రిష్ 3' నవంబర్ 1న విడుదల కాబోతోంది.

    English summary
    Filmmaker Rakesh Roshan confirmed that his much-awaited movie "Krrish 3" will now release Nov 1 instead of Nov 4. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X