»   » ఆ తప్పునాదే.... నావల్లే అలా జరిగింది, దర్శకుడు క్రిష్

ఆ తప్పునాదే.... నావల్లే అలా జరిగింది, దర్శకుడు క్రిష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రాజెక్ట్ నుంచి రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నాడు అన్న వార్త చాలామందికి షాక్ ఇచ్చింది. ఇది బాలకృష్ణ 100వ చిత్రం కావడం, విలక్షణ సినిమాలు రూపొందించే క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో అప్పటివరకూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

దేవీ ఎందుకు తప్పుకున్నాడు

దేవీ ఎందుకు తప్పుకున్నాడు

అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి దేవీ ఎందుకు తప్పుకున్నాడు అన్నది ఎవరికీ అర్థం కాలేదు. కానీ బాలయ్య, డైరెక్టర్ క్రిష్ భయపడలేదు. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా తన కంచె సినిమాకి సంగీతాన్నందించిన చిరంతన్ భట్ తో మ్యూజిక్ చేయించాడు. సరే ఆ కథ అయిపోయింది.,

ఇప్పుడు ఆ విషయం ఎందుకూ

ఇప్పుడు ఆ విషయం ఎందుకూ

గౌతమీ పుత్ర శాతకర్ణి విజయం కూడాసాధించేసింది మరి ఇప్పుడు ఆ విషయం ఎందుకూ అంటే. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్షకుడు క్రిష్ అసలు దేవీ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందన్న విషయం మీద క్లారిటీ ఇచ్చాడు, తప్పు నాదే అంటూ ఇలా అసలు ఏం జరిగిందో చెప్పేసాడు...

తగిన సమయం లేకపోవడం వల్లే

తగిన సమయం లేకపోవడం వల్లే

సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సిన నేపథ్యంలో తగిన సమయం లేకపోవడం వల్లే దేవిశ్రీ ప్రసాద్‌తో పనిచేయించుకోలేకపోయానని చెప్పాడు. దేవి చెన్నైలో ఉండే పనిచేస్తాడని, బిజీ షెడ్యూళ్లతో తాను ప్రతి సారీ చెన్నై వెళ్లి రావడం కుదరదని భావించే చిరంతన్ భట్‌ను తీసుకున్నానని చెప్పాడు.

అన్నిటినీ బేరీజు వేసుకున్నాకే

అన్నిటినీ బేరీజు వేసుకున్నాకే

ఆ సమయంలో దేవి కూడా వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని, అందుకే అన్నిటినీ బేరీజు వేసుకున్నాకే దేవిశ్రీకి నో చెప్పానని వెల్లడించాడు క్రిష్. అందుకే తనతో కంచె సినిమాకు పనిచేసిన చిరంతన్ భట్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకున్నానని వివరించాడు. తాను కోరుకున్న సమయానికే అవుట్ పుట్ ఇవ్వగలడని నమ్మానని, ఆ నమ్మకాన్ని చిరంతన్ నిలబెట్టాడని చెప్పాడు.

 చాలా ప్లస్

చాలా ప్లస్

తమ చిత్రానికి చిరంతన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయిందని, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలతో ఆ సంగీతానికి మరింత వన్నె వచ్చిందని క్రిష్ పేర్కొన్నాడు. మొత్తానికి అలా జరిగిందన్నమాట, నిజానికి చిరంతన్ భట్ ఇచ్చిన ట్యూన్లు బాగానే ఉన్నా దేవీశ్రీ ఉండి ఉంటే ఆ ఊపు వేరేగా ఉండేదన్నది దేవీ అభిమానులే కాదు, బాలయ్య అభిమానులు కూడా అన్నమాట, కానీ ఏం చేస్తాం అలా జరిగిపోయింది మరి.

English summary
For the first time, Krish shared the reason behind the replacement of DSP GautamiPutra satakarni and also took the total blame for it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu