»   » ' కంచె' ని బాలీవుడ్ స్టార్ హీరో చూస్తున్నాడు

' కంచె' ని బాలీవుడ్ స్టార్ హీరో చూస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరుణ్ తేజ హీరోగా నటించిన చిత్రం ' కంచె' . ఈ చిత్రం అక్టోబర్ 22న న విజయ దశమి సందర్బంగా విడుదల అయ్యి విజయవంతం అయ్యింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్‌ ఓ సైనికుడి పాత్రలో కన్పించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చూస్తున్నారు. ఆయన ఏమన్నా ఈ చిత్రం చూసి ఆసక్తి చూపితే రైట్స్ అమ్మే అవకాసం ఉంది. క్రిష్...గతంలో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన గబ్బర్ చిత్రం చేసిన సంగతి తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక ఈ చిత్రానికి ఎన్నారైల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని జర్మనీ భాషలోకి డబ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఓ తెలుగు సినిమా ...జర్మన్ భాషలోకి డబ్బింగ్ అవటం ఇదే తొలిసారి.


Krish showing Kanche to Akshay Kumar

ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం యుఎస్ లో మంచి ఆదరణ లభిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం...ఈ చిత్రాన్ని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కోటి పాతిక లక్షలు రూపాయలు పెట్టి సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ $501k గ్రాస్ కలెక్షన్ వచ్చిందని తెలుస్తోంది. దాంతో యుఎస్ డిస్ట్రిబ్యూటర్ మంచి లాభం సంపాదించినట్లైంది. సినిమాకు మంచి రివ్యూలు రావటంతో యుఎస్ కలెక్షన్స్ బాగున్నాయి.


Krish showing Kanche to Akshay Kumar

ఓవర్ సీస్ లో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి ప్రవేశించిన "Absolute Telugu Cinemas" వారు ఈ చిత్రం రైట్స్ ని కోటి పాతిక లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కంపెనీని కొంతమంది ఎగ్జిబిటర్స్ కలిసి ఏర్పాటు చేసుకున్నారు.

English summary
Krish will be screening the movie to all his friends in Hindi movie industry including Akshay and if any one of them is impressed he may sell off the Hindi remake rights too.
Please Wait while comments are loading...