»   »  'మా అల్లుడు లవంగం'

'మా అల్లుడు లవంగం'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Krishna Bhaghavan
కమెడియన్ కృష్ణభగవాన్ ప్రధాన పాత్రలో మరో సినిమా రెడీ అవుతోంది. మామా అల్లుళ్ల కథతో రూపొందుతోన్న చిత్రం పేరు మా అల్లుడు లవంగం. మనిషి రూపం చూసి కాదు మనసుని చూచి ప్రేమించడం ముఖ్యమనే కథాంశంతో ఈ చిత్రం తయారవుతోంది. శ్రీరంగం సతీష్‌కుమార్ దర్శకత్వంలో పాలాటి శ్రీనివాసరావు(వాసు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ ఈనెల 15 నుంచి జరిగిన షెడ్యూల్‌లో ఇప్పటివరకు అరవైశాతం టాకీ పూర్తయ్యిందని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ చిత్రం పూర్తిగా వినోదభరితంగా రూపొందుతోందని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో విజయభాస్కర్, రూప, ప్రియ, శాంతి, శ్రీజ, రఘునాథరెడ్డి, కొండవలస, జూ.రేలంగి, అపూర్వ, అల్లరి సుభాషిణి, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం- లలిత్ సురేష్, ఎడిటింగ్- శ్రీను, కెమెరా- రాము, కథ, మాటలు- మనోజ్ అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X