»   » మా ఫ్యామిలీ నుండి ఇంకొందరు కొత్త హీరోలు: బర్త్ డే పార్టీలో కృష్ణ (ఫోటోస్)

మా ఫ్యామిలీ నుండి ఇంకొందరు కొత్త హీరోలు: బర్త్ డే పార్టీలో కృష్ణ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ 73వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం పద్మాలయ స్టూడియోలో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, ప్రముఖ నిర్మాతలు సి.వి.రెడ్డి, జగదీష్ చంద్రప్రసాద్, కె.సి.శేఖర్ బాబు, కె.ఎస్.రామారావు, అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, రవి, డైరెక్టర్ బి.జయ...అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ..‘అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది. మహేష్ బాబు శ్రీమంతుడు టీజర్ కూడా ఇదే రోజు విడుదల చేసారు. చాలా బావుంది. ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలుకొట్టాలి. భవిష్యత్తులో మా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు పరిచయం కానున్నారు. జయదేవ్ పిల్లలు కూడా యాక్ట్ చేయాలనుకుంటున్నారు. అలాగే నవీన్ సినిమా త్వరలో విడుదల కానుంది. మా థర్డ్ జనరేషన్ ను కూడా ఆదరించాలని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

స్లైడ్ షోలో కృష్ణ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోస్..

కృష్ణ

కృష్ణ

అభిమానులు, కుటుంబ సభ్యులు సమక్షంలో కేక్ కట్ చేస్తున్న సూపర్ స్టార్ కృష్ణ.

సన్మానం

సన్మానం

ఈ సందర్భంగా అభిమానులు కృష్ణ-విజయ నిర్మల దంపుతలను పూలమాలలో అభిందించారు.

మరింత మంది హీరోలు

మరింత మంది హీరోలు

కృష్ణ ఫ్యామిలీ నుండి మరికొందరు హీరోలో రాబోతున్నారు. తనయుడు మహేష్ బాబు పరిశ్రమలో టాప్ హీరోగా వెలుగొందుతన్నాడు. అల్లుడు సుధీర్ బాబు ఆల్రెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. త్వరలో విజయ నిర్మల మనవడు నవీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలో కృష్ణ మనవళ్లు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఫ్యాన్స్

ఫ్యాన్స్

ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం ప్రెసిడెంట్ రాంబాబు, ఆల్ ఇండియా కృష్ణ-మహేష్ బాబు ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు ఖాదర్ గోరీ, అభిమానులు పాల్గొన్నారు.

English summary
Actor Krishna birthday celebrations held at Padmalaya studios. The actor was once one of the leading heroes of Tollywood during the 70's and 80's and received accolades for his performances from all the classes. Krishna also directed and produced several super hit films under Padmalaya Film Studios a production house owned by him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu