నవ్వితే నవరత్నాలు చిత్రంతో చిత్ర సీమలోకి
ప్రవేశించినప్పటికీ.. ఎన్టీఆర్ నిర్మాతగా మారి నిర్మించిన పిచ్చి పుల్లయ్య చిత్రంలో కృష్ణకుమారికి అవకాశం లభించింది. నవ్వితే నవరత్నాలు చిత్రంలో నా నటనను చూసి పిచ్చిపుల్లయ్యలో అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనతో సినీ ప్రయాణం మరువలేనిది అని కృష్ణకుమారి వెల్లడించారు.
ఎన్టీఆర్‌తో 25 చిత్రాలు
తెలుగు అగ్రహీరోలలో 25 చిత్రాల్లో నటించాను. మేమిద్దరం నటించిన సినిమాలన్నీ ఘన విజయాలు సాధించాయి. మా చిత్రాల్లోని పాటలు చాలా ప్రజాదరణ పొందాయి.
యాక్టింగ్‌లో శిక్షణ తీసుకోలేదు
తొలుత సాంఘీక చిత్రాలతో ప్రారంభించి ఆ తర్వాత పౌరాణిక చిత్రాల్లో నటించాను. నా అందం, అభినయం చూసే అవకాశాలు నాకు లభించాయి. యాక్టింగ్‌లో శిక్షణ తీసుకోలేదు. కానీ డ్యాన్స్ అవీ నేర్చుకొన్నాను.
ఎన్టీఆర్ అలా.. ఎఎన్నాఆర్..
షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ మనస్తత్వాలు వేర్వేరుగా ఉండేవి. సెట్లో ఎన్టీఆర్ గంభీరంగా ఉంటే.. ఏఎన్నాఆర్ చాలా సరదాగా ఉండేవారు. ఒక్కసారి ఎన్టీఆర్ సీన్లలోకి ఎంటరైతే పరిస్థితి చాలా ఆహ్లాదంగా ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌లు సహచర నటీనటులకు సూచనలు ఇచ్చేవారు.
అప్పుడు నటించడం గొప్ప
ఆ కాలంలో నటించడం చాలా గొప్ప. ఎమోషన్ సీన్లలో ఒకరు బాగా చేసినా మరొకరు చేయకపోతే మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సన్నివేశాల చిత్రీకరణ సులభమైంది అని కృష్ణకుమారి చెప్పారు.
కృష్ణకుమారి నటించిన పాటలు
చిత్రం: అభిమానం.. ఓహో బస్తీ దొరసాని.. బాగా ముస్తాబయ్యింది.. అందాచందాల వన్నెలాడి
చిత్రం: బందిపోటు.. వగలరాణివి నీవ్వే.. సోగసుకాడను నేనే.. ఈడు కుదిరెను.. జోడు కుదిరెను.. కోపమంతా పైపైనే.. చూపులన్నీ నాపైనే..
చిత్రం: తిక్క శంకరయ్య.. కోవెల ఎరుగని.. దేవుడు కలగని.. అనుకొంటినా నేను ఏనాడు --
కిలకిల నవ్వులు తెలిపినా..పలుకును నాలో బంగారు వీణ.. అంటూ ఏఎన్నాఆర్‌తో రొమాన్స్ చేసిన పాట ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
చిత్రం: అగ్గిపిడుగు.. ఏమో ఏమో ఇది.. నాకేమో ఏదో ఏదో అయినది.. ఈవేళలో నా గుండెలో గుబులవుతున్నది.
కానిస్టేబుల్ కూతురు జగ్గయ్య.. తిరుపతమ్మ కథ ఎన్టీఆర్‌తో
ఉమ్మడి కుటుంబం