twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ నిర్మల మృతికి అసలు కారణం ఇదే.. కుమిలిపోతూ కృష్ణ

    |

    సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, దర్శకురాలు విజయ నిర్మల జూన్ 27వ తేదీన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మృతి టాలీవుడ్ చిత్రసీమను శోక సంద్రంలోకి నెట్టేసింది. అన్నీ తానై తనకు అండగా నిలిచిన భార్య విజయ నిర్మల మరణించడాన్ని జీర్ణించుకోలేక పోయారు కృష్ణ. ఎంతమంది ఓదార్చినా తన సతీమణిని తలుచుకుంటూ కుమిలిపోయారు. కాగా శనివారం రోజు విజయనిర్మల సంతాప సభ ఏర్పాటు చేశారు.

    హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విజయ నిర్మల సంతాప సభలో పలువురు సినీ ప్రముఖులు హాజరై ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు మురళీ మోహన్, జయసుధ, బాలకృష్ణ, నమ్రత తదితరులు హాజరై విజయనిర్మల నివాళులు అర్పించారు. కాగా ఈ వేదికపై మాట్లాడిన సూపర్ స్టార్ కృష్ణ తన భార్యను తలచుకొని కన్నీరు పెట్టుకున్నారు.

    Krishna says Reason Behind Vijaya Nirmalas Death

    ఈ సందర్భంగా విజయ నిర్మల గురించి చెప్పుకొచ్చిన కృష్ణ.. ఆమెకు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండేదని, ఎప్పటి విషయాన్నైనా ఇట్టే గుర్తుపెట్టుకొని ఉండేదని అన్నారు. ఆ రోజు రాత్రి సడెన్‌గా విజయ నిర్మల బెడ్ మీద నుంచి క్రింద పడిందని.. వెంటనే తాము హాస్పిటల్ తీసుకెళ్లామని చెప్పారు. అయితే ఆమె తలకు గాయం కావడం వల్ల మెడనరం చిట్లినట్లయిందని, డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా ఆమె తుదిశ్వాస విడువక తప్పలేదని కృష్ణ అన్నారు. ఆ రోజు రాత్రే 1 గంట సమయంలో ఆవిడ మమ్మల్ని వదిలి అనంత లోకాలకు వెళ్లిపోయిందని కృష్ణ కంటతడి పెట్టుకున్నారు

    విజయ నిర్మల సినీ ప్రస్థానం చెప్పుకోదగినది. బాల నటిగా వెండితెర ఆరంగేట్రం చేసిన ఆమె 200 లకు పైగా చిత్రాల్లో నటించి హీరోయిన్ గా చెరగని ముద్ర వేసుకుంది. అలాగే 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గొప్ప దర్శకురాలిగా కీర్తి గడించింది విజయనిర్మల. ఆమె జీవిత ప్రయాణంలో ఎన్నో మరపురాని ఘట్టాలు ఉన్నాయి. ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా కూడా రికార్డు సృష్టించింది విజయనిర్మల.

    English summary
    Super Star krishna wife Vijaya Nirmala paased away on june 27th. On her Death so many industry people and politicians responds and giving their condolence. And now Krishna says reason on Vijaya Nirmala death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X