'ప్రజారాజ్యం' కు పాతికేళ్ళు

పాతికేళ్ల క్రిందటి రైతు పరిస్థితి వేరు. రైతు సంఘాలు లేవు. వారి గురించి పట్టించుకునే వారు కానీ, పోరాడేవారు కానీ లేరు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్క రైతు ప్రతిక్షణం దోపిడికి గురయ్యేవాడు. రైతులందరూ కలిసికట్టుగా ఉండకపోతే దళారులు వారిని భక్షిస్తారనీ, అలా జరగకుండా వారిని మేల్కొలపటం కోసమే అప్పట్లో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు హీరో కృష్ణ చెప్పారు. దళారీల వ్యవస్థ నశించి, రైతే తను పండించింది అమ్ముకునే సంప్రదాయం ప్రారంభించాలని హీరో పాత్ర ద్వారా చెప్పించి రైతు బజారులకు తమ సినిమాతోనే అంకురార్పణ చేశామని కూడా ఆయన తెలిపారు.
నిజానికి ఈ సినిమా తీయాలన్నది హీరో కృష్ణ తల్లి నాగరత్నమ్మ చిరకాల కోరిక . రైతు కుటుంబంలో పుట్టి, రైతు కుటుంబంలో మెట్టిన ఆవిడకు ఎప్పుడూ రైతుల సమస్యల గురించి చింత ఉండేది. ఈఅందుకే ప్రజారాజ్యం సినిమా తీసి అమ్మకోరిక నెరవేర్చారు కృష్ణ. తల్లి పేరిట బేనరును ఏర్పాటు చేసి, ఆమె నిర్మాతగా ఈ సినిమా తీశారు. చిత్రం నిర్మించటంతో అమ్మ కోరిక నెరవేరిందని ఆయన ఆనందంతో చెబుతారు. ఇక కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ...అప్పట్లో ..తమ చిత్రాలకు పెట్టే టైటిల్స్ ఎంతో అర్ధవంతంగా, ఉపయోగకరంగా ఉండేవనీ పేర్కొంటూ, తాజాగా ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీకి తమ సినిమా టైటిల్‌నే ఉపయోగించుకున్నారనీ అన్నారు.


Click it and Unblock the Notifications











