»   » రమ్యకృష్ణ నక్షత్రం కాదు.. ఆకాశం.. చుక్కలు చూపించాను.. కృష్ణవంశీ

రమ్యకృష్ణ నక్షత్రం కాదు.. ఆకాశం.. చుక్కలు చూపించాను.. కృష్ణవంశీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో సెన్సేషనల్ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. విభిన్నమైన చిత్రాలను తీసి ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనది డిఫరెంట్ స్టయిల్. రాశి కంటే వాసి ఎక్కువగా నమ్మే కృష్ణవంశీ గత 20 ఏళ్లలో ఆయన తీసింది కేవలం 20 చిత్రాలు మాత్రమే. తాజాగా ఆయన రూపొందించిన నక్షత్రం చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తన కుమారుడు, భార్య రమ్యకృష్ణపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. అవేమిటంటే..

చాలామందికి చుక్కలు చూపించాను

చాలామందికి చుక్కలు చూపించాను

ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కృష్ణవంశీని యాంకర్ ఉదయభాను సరదాగా ప్రశ్నను అడిగింది. ఎంతో మంది స్టార్స్‌తో మీరు వర్క్ చేశారు కదా?.. మీకు ఏ స్టార్ అయినా చుక్కలు చూపించారా?'' అని అడగ్గా.. చాలా మంది నటులకు నేనే చుక్కలు చూపించాను' అంటూ కృష్ణ వంశీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

నా కొడుకు నక్షత్రం

నా కొడుకు నక్షత్రం

‘మీ లైఫ్‌లో నక్షత్రం ఎవరు? సినిమాలో నక్షత్రం ఎవరు?' అని ఉదయభాను అడిగిన మరో ప్రశ్నకు ‘నా లైఫ్‌లో నక్షత్రం నా కొడుకు' అని కృష్ణవంశీ చెప్పారు. అయితే వేదిక మీద ఉన్న కొందరు రమ్యకృష్ణ పేరు ప్రస్తావించారు. దానికి కృష్ణవంశీ స్పందిస్తూ ‘రమ్యకృష్ణ నక్షత్రం కాదు.. ఆకాశం' అని బదులిచ్చారు. కృష్ణవంశీ సమాధానానికి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ నవ్వేశారు. ఇక ఈ సినిమా విషయంలో అందరూ నక్షత్రాలే అని సెలవిచ్చారు కృష్ణవంశీ.

కృష్ణవంశీ, రమ్యకృష్ణల వివాహం ఇలా..

కృష్ణవంశీ, రమ్యకృష్ణల వివాహం ఇలా..

చంద్రలేఖ సినిమా షూటింగ్‌లో హీరోయిన్ రమ్యకృష్ణతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తమ ప్రేమను వారిద్దరూ పెళ్లిపీటలపైకి ఎక్కించారు. 2003 జూన్‌ 12న కృష్ణవంశీ, రమ్యకృష్ణ వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారికి ఓ కుమారుడు కలిగాడు. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన పాత్రకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

English summary
Creative Director Krishna Vamshi made sensational comments at Nakshatram Audio release funtion. He said Ramya krishna is sky not a star in my life. He revealed his son would be a star in his life. Actress Ramyakrishna, Krishna vamsi got married in 2003.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu