»   » ఆ హీరోకు జ్ఞాపకశక్తి తక్కువ.. రెండు డైలాగులు చెప్పలేడు.. రాంచరణ్ గురించి కృష్ణవంశీ..

ఆ హీరోకు జ్ఞాపకశక్తి తక్కువ.. రెండు డైలాగులు చెప్పలేడు.. రాంచరణ్ గురించి కృష్ణవంశీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో ఫిలిం మేకింగ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీది ప్రత్యేకమైనది. అనుకున్న కథను, సీన్లను పక్కాగా తెరకెక్కించడంలో ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పుకొంటాడు. సన్నివేశాలను తాను అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానికి చాలా కష్టపడుతారని, అందుకోసం నటీనటలును కష్టపెడుతారనే పేరును ఆయన సంపాదించుకున్నారు. కృష్ణవంశీతో పనిచేసిన కొందరు నటీనటులు ఆయనతో మళ్లీ పనిచేయాలంటే దడుసుకొంటారు. తనతో పనిచేయడం కష్టమనే ఆరోపణలపై ఇటీవల మీడియాకు కృష్ణ వంశీ వివరణ ఇచ్చారు. అదేమిటంటే..

నా గురించి చెడుగా చెప్పుకొంటారు..

నా గురించి చెడుగా చెప్పుకొంటారు..

నాతో కలిసి పనిచేసినవాళ్లలో కొంత మంది తిట్టుకొనే వాళ్లుంటారు. ఆ విషయం నాకు తెలుసు. అయితే కృష్ణవంశీ దగ్గర చాలా నేర్చుకున్నాను అనే వాళ్లను, అలా చెప్పిన వాళ్లను ఎక్కువ మంది ఉన్నారు. నా గురించి చెడు చెప్పేవాళ్ల కంటే మంచి చెప్పే వాళ్లే ఎక్కువ అని తెలుసు. అదీ చాలు నాకు సంతృప్తి కలుగడానికి అని కృష్ణవంశీ అన్నారు.


Krishna Vamshi Condemned Allegation which Targetted by few Heros
ఆ హీరో పాత్రను అర్థం చేసుకోడు..

ఆ హీరో పాత్రను అర్థం చేసుకోడు..

నా గురించి చెడుగా చెప్పే వాళ్లలో ఒక హీరో గురించి తెలుసు. అతనికి జ్ఞాపకశక్తి తక్కువని, రెండు డైలాగుల కంటే ఎక్కువ చెప్పలేడని కృష్ణ వంశీ తెలిపారు. ఆ హీరో పేరును ప్రస్తావించడానికి నిరాకరించినట్టు సమాచారం. ఆ హీరో సరిగ్గా పాత్రను అర్థం చేసుకోలేడని, అలా కాదు.. ఇలా చెయ్యి అంటే నాపై ద్వేషం పెంచుకొంటాడని పేర్కొన్నారు.


నాపై హీరోలు అలుగుతారు..

నాపై హీరోలు అలుగుతారు..

చాలా మంది నాకేదో మేలు చేస్తున్నారనే రీతిలో ఉంటారని, బాగా నటించు అంటే నాపై అలుగుతారని కృష్ణవంశీ అన్నారు. సీన్లు సరిగా రాకపోతే మళ్లీ మళ్లీ చేయిస్తాను. దాంతో షూటింగ్‌లో టేకులు పెరుగుతాయి. దాంతో తనపై అవాకులు చెవాకులు పేల్చుతుంటారని, బయటకు వెళ్లి తన గురించి చెడు ప్రచారం చేస్తారని ఆయన అన్నారు.


నోట్ల రద్దు ప్రభావం..

నోట్ల రద్దు ప్రభావం..

నక్షత్రం సినిమా ఆలస్యం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ మంది హీరోలు, నటీనటులు ఉన్నారు. యాక్షన్ సీన్లు ఉన్నాయి. వాటిని తెరకెక్కించడానికి చాలా సమయం పట్టింది. అంతేకాకుండా నోట్ల రద్దు కూడా ప్రభావం చూపింది అని కృష్ణవంశీ తెలిపారు.


బిగ్ ‌బీ చేస్తేనే రైతు..

బిగ్ ‌బీ చేస్తేనే రైతు..

నందమూరి బాలకృష్ణతో రైతు సినిమా చేయాల్సి ఉంది. బాలయ్య కూడా ఆసక్తితో ఉన్నాడు. కానీ ఆ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర ఉంది. అది అమితాబ్ బచ్చన్ చేస్తేనే బాగుంటుంది. బిగ్ బీ చేస్తేనే ఆ సినిమా పట్టాలెక్కుతుంది అని కృష్ణవంశీ అన్నారు.


రాంచరణ్‌కు నిరాశే మిగిలింది..

రాంచరణ్‌కు నిరాశే మిగిలింది..

సినిమాను ప్రేక్షకుల అంచనాల మేరకు గోవిందుడు అందరివాడే చిత్రాన్ని తీయలేకపోయాను. మెగా హీరో రాంచరణ్‌కు నిరాశ కలిగించాను. ఆ విషయంలో చెర్రీకి రుణపడి ఉన్నాను. ఆయన కెరీర్‌లో గుర్తుండి పోయే సినిమాను చేయాలని ఉంది. అంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది సాధ్యమవుతుంది అని కృష్ణవంశీ వెల్లడించారు.English summary
Krishna Vamshi condemned allegation which targetted by few artists. He said A hero had memory problem. He unable to deliver two dialouges at a time. Krishan Vamshi regrets about not giving a hit to Hero Ram Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu