»   » 'పైసా' లో అదే చూపించబోతున్నా : కృష్ణవంశీ

'పైసా' లో అదే చూపించబోతున్నా : కృష్ణవంశీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నాని,కృష్ణవంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'పైసా' . నాని, కేథరిన్‌ జంటగా నటించారు. సిద్ధికా శర్మ మరో కీ రోల్ పోషించింది. రమేష్‌ పుప్పాల నిర్మాత. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో కృష్ణ వంశీ మాట్లాడారు.


కృష్ణ వంశీ మాట్లాడుతూ.... ''డబ్బు డబ్బు డబ్బు. లేచింది మొదలు ప్రతి ఒక్కరూ పఠించేది మనీ మంత్రమే. పచ్చ నోటు చుట్టూ ప్రదక్షిణలే. వేలు, లక్షలు అనే మాటకి ఇప్పుడు విలువే లేదు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ అందరూ సరదాగా మాట్లాడేస్తున్నారు. సంపాదన మోజులో మనుషులమన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పచ్చ నోట్ల నీడలో అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. మన జీవనాన్ని, సామాజిక పరిస్థితుల్నీ డబ్బే శాసిస్తోంది. ఈ విషయాన్ని మా చిత్రంలో చూపించాము'' అన్నారు కృష్ణవంశీ.

నిర్మాత మాట్లాడుతూ ''వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించే కథ ఇది. డబ్బు చుట్టూ సాగుతుంది. వినోదానికి ప్రాధాన్యమిస్తూనే ఆలోచన రేకెత్తించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు. ఇందులో నాని నటన అందరికీ నచ్చుతుంది''అన్నారు.

ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్రవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

నిర్మాతలు కూడా ఆయన క్రియేటివిటీకి తగిన విధంగా భారీగా ఖర్చు పెడుతున్నారు. కేవలం పాటల చిత్రీకరణ కోసం దాదాపు కోటికిపైగా వెచ్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా కాస్టూమ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నాని కాస్ట్యూమ్స్ కోసం స్వారోవ్‌స్కి క్రిస్టల్స్ వాడుతున్నారు.

English summary

 Krishna Vamsi is wielding the megaphone for Paisa. Catherine Thresa has been paired opposite Nani in this flick which is in the last leg of shooting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu