For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైట్ బోయ్ గా కృష్ణవంశీ

  By Staff
  |

  ఈ రోజున తెలుగు సినీ ప్రపంచాన్ని తన సృజనాత్మకతతో ఏలుతున్న కృష్ణవంశి...కెరీర్ ప్రారంభం రోజుల్లో లైట్ బోయ్ గా చేసారు. కెమెరామెన్‌ కె ఎస్‌ ప్రకాష్‌ సహకారంతో 'లైట్‌ బాయ్‌"గా మొదలైన ఆయన సినీ ప్రస్థానం కెమెరామెన్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌ పొందారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు (జూలై 28)సందర్భంగా ఆయన అబిమానులు కృష్ణవంశి ఎదిగిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.

  ఆ తర్వాత కృష్ణవంశి ..ప్రముఖ దర్శకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి తిరిగి ఎన్నో కష్టాలు, అవమానాలు భరించి 'నా పేరే దుర్గ" చిత్రానికి దర్శకత్వం వహించిన త్రిపురనేని వరప్రసాద్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కుదిరారు. కానీ ఈ చిత్రం విడుదలవ్వలేదు. తర్వాత మరో రెండు చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసినా అవి కూడా విడుదలకు నోచుకోలేదు. అయినా ఎక్కడా నిరాశ చెందలేదు. ఎప్పటికైనా తానో టాప్‌ డైరెక్టర్‌ కావాలనే ఆశయం ఆయన్ని వెన్ను తట్టి ప్రోత్సహించింది. ఆయన ఆశయం నెరవేర్చేందుకు ఆదృష్టం రామ్‌గోపాల్‌ వర్మ రూపంలో ప్రత్యక్షమైంది.

  'శివ" చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశమొచ్చింది. ఆ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అవడంతో రామ్‌గోపాల్‌ వర్మ బిజీ అయిపోయారు. తర్వాత ఆయన చేసిన 'క్షణ క్షణం", 'రాత్రి", 'అంతం" చిత్రాలకు కూడా అసిస్టెంట్‌గానే కృష్ణ వంశీ పనిచేశారు. ఆయనలోని క్రియెటివిటీని చూసిన రామ్‌గోపాల్‌ వర్మ తాను నిర్మించబోయే చిత్రానికి దర్శకునిగా కృష్ణవంశీకి అవకాశమిచ్చారు. ఎన్నాళ్లుగానో దర్శకుడిన వ్వాలనే తన స్వప్నం 'అనగనగా ఒకరోజు" చిత్రంతో నెరవేరుతోందని ఎంతో సంతోషపడ్డాడు. అయితే అది ఎంతోకాలం నిలవలేదు.

  అయితే ఆ చిత్రానికి అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్‌ అయిపోతుండటంతో మధ్యలో కృష్ణవంశీని డ్రాప్‌చేసి తానే స్వయంగా దర్శకత్వం చేసుకున్నారు రాంగోపాల్‌ వర్మ. అయినా నిరుత్సాహానికి గురి కాకుండా తగిన సమయంకోసం ఎంతో ఓపికతో నిరిక్షించారు కృష్ణవంశీ. ఆయన నిరీక్షణ వృధాకాలేదు. తన మూలంగా డైరెక్టర్‌ కావలసిన వ్యక్తికి తన మూలంగానే బ్రేక్‌ అవడం ఇష్టంలేని రాంగోపాల్‌ వర్మ తానే తిరిగి కృష్ణ వంశీకి దర్శకుడిగా ఛాన్స్‌ ఇచ్చారు.

  అలా అమితాబ్ ఎబిసిల్ కార్పోరేషన్ పై 'గులాబి"చిత్రానికి అవకాశం వచ్చింది. తొలిసారి దర్శకత్వం వహించిన 'గులాబి" మంచి విజయాన్ని సాధించడంతో వెంటనే నాగార్జున హీరోగా 'నిన్నే పెళ్లాడతా" చిత్రానికి అవకాశం వచ్చింది.అక్కడ నుంచి ఆయన విజయాలకు ఎదురేలేకుండా పోయింది.'సింధూరం", 'చంద్రలేఖ", అంతఃపురం", 'సముద్రం", 'మురారి", 'ఖడ్గం", 'శ్రీ ఆంజనేయం" 'చక్రం", 'డేంజర్‌",'రాఖీ", 'శశిరేఖా పరిణయం" చిత్రాలకు దర్శకత్వం వహించారు.

  సినిమా అన్నది గొప్ప ఆద్భుతమైతే, సినిమా జీవితం గొప్ప'వరం"" అని నమ్మే కృష్ణ వంశీ1962 జులై 28న తాడేపల్లిగూడెంలో పద్మావతి, శ్రీరామచంద్రమూర్తి దంపతులకు జన్మించారు.నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు దట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X