»   » సాయిధరమ్ తేజ్ కాదు.. సంజయ్ దత్.. ఫ్రీగానే చేశాడు.. మరో షాకిచ్చిన కృష్ణవంశీ

సాయిధరమ్ తేజ్ కాదు.. సంజయ్ దత్.. ఫ్రీగానే చేశాడు.. మరో షాకిచ్చిన కృష్ణవంశీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నక్షత్రం సినిమాలోని ఓ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను సంప్రదించానని దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంట్వర్యూలో పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల కుదర్లేదని ఆయన చెప్పారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన నక్షత్రం సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు దూరంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

సంజయదత్ అనుకొన్నాం..

సంజయదత్ అనుకొన్నాం..

నక్షత్రం విడుదలను పురస్కరించుకొని కృష్ణవంశీ ఓ జాతీయ ఆంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. సమాజంలో పోలీసులు అందిస్తున్న సేవలను కథాంశంగా తీసుకొని నక్షత్రం సినిమా రూపొందించాను. ఈ చిత్రంలో నిజాయితీ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం సంజయ్ దత్‌ను అనుకొన్నాను. కానీ కుదరకపోవడంతో సాయి ధరమ్ తేజ్‌ను తీసుకొన్నాం అని కృష్ణవంశీ వెల్లడించారు.

సాయికి కథ చెప్పగానే ఇష్టపడ్డాడు..

సాయికి కథ చెప్పగానే ఇష్టపడ్డాడు..

వాస్తవానికి సాయి పోషించిన పాత్రకు ఓ మధ్య వయసు ఉన్న హీరోను తీసుకోవాలని అనుకొన్నాం. దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న పాత్రను డిజైన్ చేశాను. ఆ పాత్ర కోసం సంజయ్ దత్‌ను తీసుకోవాలని అనుకొన్నాం. డేట్స్ కుదరకపోవడంతో వీలు కాలేదు. ఓ పార్టీలో కలిసిన సాయికి కథ చెప్పగా చేయడానికి ఇష్టపడ్డాడు. దాంతో ఆ పాత్రను సాయి చేశాడు. అని కృష్ణవంశీ పేర్కొన్నాడు.

సాయిని దృష్టిలో పెట్టుకొని

సాయిని దృష్టిలో పెట్టుకొని

పదేళ్లుగా సాయిధరమ్ తేజ్ తెలుసు. ఇటీవల ఓ పార్టీలో కలిసినప్పుడు రెండు గంటలు మాట్లాడుకొన్నాం. అప్పుడే ఆయనను ఆ పాత్రకు సరిపోతాడని ఊహించుకొన్నాను. ఆ తర్వాత యువ హీరో అయితే ఇంకా బాగుంటుదని అనుకొన్నాను. అందుకే ఆ పాత్రను చాలా డైనమిక్‌గా మలిచాను. సాయి కూడా ఆ పాత్ర గురించి తెలుసుకొని సంతోషపడ్డాడు అని కృష్ణవంశీ తెలిపారు.

సాయి ఉచితంగా నటించాడు.

సాయి ఉచితంగా నటించాడు.

30 నిమిషాల పాత్ర కోసం సాయి ధరమ్ రెమ్యునరేషన్ తీసుకోలేదు. పాత్ర గురించి విన్నాక ఉచితంగా నటిస్తాను అని అన్నాడు. ఇక ముందు కూడా తాను తీయబోయే చిత్రంలో నటించడానికి సాయి ఆసక్తి చూపాడు అని కృష్ణవంశీ పేర్కొన్నాడు. ఈ చిత్రంలో సందీప్ కిషన్, రెజీనా కసండ్రా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాశ్ రాజ్ నటించారు.

English summary
Director Krishna Vamsi says he originally considered actor Sanjay Dutt for a crucial role in his forthcoming Telugu action-drama Nakshatram, which throws the spotlight on the lives of a bunch of policemen. Sanjay was considered for the character played by Sai Dharam Tej in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu