»   » సంజయ్ దత్ స్థానంలో సాయి ధరమ్ తేజ్: యంగ్ పోలీస్ మ్యాన్

సంజయ్ దత్ స్థానంలో సాయి ధరమ్ తేజ్: యంగ్ పోలీస్ మ్యాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని సార్లు సినిమాల్లో కొన్ని పాత్రలు ఎప్పుడూ వెంటాడతాయి. ఆ పాత్రలు చేసిన నటులూ అలాగే గుర్తుండి పోతారు. అయితే చాలా వరకూ అలాంటి పాత్రలలో జరిగే విచిత్రం ఏమిటీ అంటే దర్శకుదు ఆ పాత్రని ఎవరో ఒక నటున్ని దృష్టిలో పెట్టుకొని రాస్తాడు, కానీ మరెవరో నటుడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ రెండో నటుడే ఆ పాత్రకి ప్రాణం పోస్తాడు. ఇండియన్ క్లాసిక్స్ లో ఒకటైన షోలే లో గబ్బర్ పాత్ర ని దక్కించుకోవటం కోసం అప్పట్లో అమ్జాద్ ఖాన్ చాలానే కష్టపడ్డాడట..

అతన్ని తీసుకోవటానికి సంశయించిన దర్శకుడికే ఆ తర్వాత గబ్బర్ పాత్రని అంతగా పండించిన అమ్జాద్ ఖాన్ నటన చూసి దిమ్మ తిరిగి పోయిందట. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందీ అంటే తాజాగా కృష్ణవంశీ తెరమీదకి తెచ్చిన నక్షత్రం లో కూడా సాయి ధరమ్ తేజ్ చేస్తున్న పాత్ర నిజానికి బాలీవుడ్ డాన్ సంజయ్ దత్ ని దృష్టిలో ఉంచుకొని రాసుకున్నాడట.

రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న కాలం లోనే బాలీవుడ్ లో నటులూ, టెక్నీష్యన్ల తో పరిచయాలున్నాయి. దౌడ్ సినిమాకు పని చేసినప్పుడే సంజయ్ తో పరిచయం ఉండటం తో తన చంద్ర లేఖలో చిన్న క్యామియో వేయించాడు. వేరీజ్ మై వైఫ్ అంటూ వచ్చే ఒక పిచ్చివడి పాత్ర ని చేయటానికి ఏమాత్రం సంకోచించకుండా ఒప్పుకున్నాడు సంజయ్.

Krishna Vamsi had considered Sanjay Dutt for 'Nakshatram'

అయితే ఈ సారి మళ్ళీ చిన్నదే అయినా కాస్త గుర్తుండి పోయే రోల్ చేయిద్దామనుకున్నాడట. కానీ కుదరలేదు ఇప్పుడు ఆ పాత్రకే సాయి ధరమ్ తేజ్ ని తీసుకున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా 'నక్షత్రం'లో సాయిధరమ్ తేజ్ చేసిన క్యారెక్టర్ సంజయ్ దత్ ను దృష్టిలో పెట్టుకునే రాశాడట కృష్ణవంశీ.

కానీ అనుకోకుండా ఆ పాత్రలోకి సాయిధరమ్ తేజ్ వచ్చాడని కృష్ణవంశీ తెలిపాడు. ముందు తాను అనుకున్న ప్రకారం అది మిడిలేజ్డ్ క్యారెక్టర్ అని.. సంజయ్ దత్ ఆ పాత్ర చేస్తే బాగుంటుందనుకున్నానని.. సంజూ అయితే ఆ పాత్ర డీఎస్పీగా ఉండేదని.. ఐతే అనుకోకుండా ఒక పార్టీలో సాయిధరమ్ ను కలవడం.. తర్వాత అతనే ఈ పాత్రలోకి రావడం.. తన కోసం పాత్రను మార్చి యంగ్ పోలీస్ గా మార్చడం జరిగిందని కృష్ణవంశీ వెల్లడించాడు. ఈ పాత్ర చేయడానికి సాయిధరమ్ సంతోషంగా ఒప్పుకోవడమే కాక.. ఉచితంగా పని చేశాడని కృష్ణవంశీ వెల్లడించాడు.

English summary
Director Krishna Vamsi says he originally considered actor Sanjay Dutt for a crucial role in his forthcoming Telugu action-drama "Nakshatram", which throws the spotlight on the lives of a bunch of policemen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu