»   » కృష్ణవంశీ రిస్క్ తీసుకుంటున్నాడా? "నక్షత్రం" కోసం ఎదురుడబ్బులు

కృష్ణవంశీ రిస్క్ తీసుకుంటున్నాడా? "నక్షత్రం" కోసం ఎదురుడబ్బులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం మూవీపై రకరకాల న్యూస్ వస్తున్నాయి. ప్రాజెక్ట్ గురించి అప్ డేట్స్ కూడా ఆగిపోవడంతో ఇక మూవీని పక్కన పెట్టేశారని.. రిలీజ్ ఆగిపోయినట్లేనని ఈ మధ్య ఓ టాక్ నడించింది.కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న 'నక్షత్రం' చిత్రం ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని, ఫైనాన్స్‌ లేక షూటింగ్‌ నిలిచిపోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ మే లో సినిమా థియేటర్లలోకి వస్తుందంటూ నిర్మాతలు చెప్పేసారు. కానీ ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ మరోలా ఉంది.

ఆర్థిక పరమైన ఇబ్బందులు

ఆర్థిక పరమైన ఇబ్బందులు

ఈ చిత్రం నిజంగానే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇప్పుడు ఇదే వ్యవహారం మొత్త కృష్ణ వంశీ తలకెత్తుకున్నాడనీ ఒకటాక్, అసలింతకీ ఏమైందీ అంటే ముందు అనుకున్న బడ్జెట్‌ కంటే పెరిగిపోవడంతో నిర్మాతలు చేతులు ఎత్తేసారని, మిగతా షూటింగ్‌ చేయడానికి నిర్మాతలు ఎటునుంచి ఫండ్స్‌ తీసుకురాకపోయేసరికి కృష్ణవంశీ తన సొంత డబ్బులు పెట్టాలని నిర్ణయించుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

శ్రీను వైట్ల

శ్రీను వైట్ల

మిగతా భాగం షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌, పబ్లిసిటీ, ప్రింట్స్‌ వగైరా ఖర్చులన్నీ ఇప్పుడు కృష్ణవంశీ భరించాలన్నమాట. అయితే ఈమధ్య ఇదే తరహా లో మిస్టర్ విషయం లోనూ శ్రీను వైట్ల తన సొంత ఫ్లాట్ పోగొట్టుకున్నారనే వార్త కూడా వినిపించింది. మిస్టర్ కోసం కూడా అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవటం తో తన సొంత డబ్బు పెట్టి రెమ్యునరేషన్ తీసుకోకపోగా ఎదురు తానే నష్ట పోయాడంటున్నారు టాలీవుడ్ జనం.

తన సొంత డబ్బు

తన సొంత డబ్బు

మరి ఇప్పుడు కృష్ణ వంశీ కూడా అదే తరహా లో "నక్షత్రం" కోసం తన సొంత డబ్బు పెట్టేస్తే... ఇప్పుడు బానే ఉంటుంది గానీ ఫలితం ఏదైనా అటూ ఇటు అయితే??? అన్నదే ఇప్పుడు అందరి అనుమానం. ఇలా ఆలోచించటానికీ కారణాలున్నాయి. కృష్ణవంశీతో సహా మొత్తం టీమ్ ఎవరూ పెద్ద సక్సెస్‌లో లేకపోవడంతో నక్షత్రంకి క్రేజ్‌ రావడం లేదు.

 సాయి ధరమ్‌ తేజ్‌ ప్రత్యేక పాత్ర

సాయి ధరమ్‌ తేజ్‌ ప్రత్యేక పాత్ర

సందీప్‌ కిషన్‌, రెజీనా జంటగా నటిస్తోన్న నక్షత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. అన్న ఒక్క మెరుపు తప్ప పెద్ద ఆకర్షించే విషయాలేం లేవు. దాంతో లేనిపోని రిక్ ఎందుకు లెమ్మని బయ్యర్లు కూడా ఈ చిత్రంపై అంతగా ఆసక్తి చూపించకపోవడం కూడా ఆర్థిక ఇబ్బందులకి కారణమేనంటున్నారు. బయ్యర్లు దొరకని పక్షంలో ఈ చిత్రాన్ని పూర్తి రిస్కు భరించి పూర్తి చేయటమే కాకుండా కృష్ణవంశీనే విడుదల చేసుకోవాలి.

English summary
Umpteen speculations have been in circulation on Krishna Vamsi's 'Nakshtram'. As there was reportedly no development on the project for past few months, rumors spread like wildfire.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu