»   » మహేష్ కెరీర్లో నెం.1 : కృష్ణ....మోడీ నినాదంలో నరేష్ లింకు (వీడియో)

మహేష్ కెరీర్లో నెం.1 : కృష్ణ....మోడీ నినాదంలో నరేష్ లింకు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' సినిమా ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు తండ్రి కృష్ణతో పాటు, విజయ నిర్మల, సీనియర్ నరేష్ తదితరులు ప్రసాద్ ల్యాబ్స్ లో ‘శ్రీమంతుడు' స్పెషల్ షో వీక్షించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు.

కన్నార్పకుండా చూసేంత అద్భుతంగా సినిమా ఉందని, సినిమాలో బాగోలేదని చెప్పడానికి ఒక్కసీన్ కూడా లేదన్నారు. సినిమా చూసిన తర్వాత 100 శాతం సంతృప్తి చెందానని, మహేష్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. మహేష్ కెరీర్లో నెం.1 పిక్చర్ అవుతుంది. ఈ సినిమాతో పూర్తి స్థాయి ఆర్టిస్టుగా ప్రూవ్ చేసుకున్నాడు. డైరక్షన్ చాలా బావుంది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి సినిమా చూడలేదు. మహేష్ ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలి, ఇంకా ఎత్తుకు ఎదగాలి అని కృష్ణ ఆకాంక్షించారు.


Krishna watches Srimanthudu movie

విజయ నిర్మాల మాట్లాడుతూ సినిమా చాలా బావుందని, ఎంతో అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించాడు. సినిమాలో అనవసర సీన్లు, కావాలని పెట్టే కామెడీ లేకుండా చాలా బావుంది. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇంది. మంచి సందేశాత్మక చిత్రం అన్నారు.


సీనియర్ నరేష్ మాట్లాడుతూ...మహేష్ బాబు కెరీర్లో ఇదో బ్లాక్ బస్టర్. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘర్ వాపసీ నినాదాన్ని, బ్యాక్ టు విలేజ్ నినాదాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది. దేశంలోని యువతకు ఇన్స్ స్పిరేషన్ గా ఈ సినిమా ఉంది. సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. మా మదర్ విజయ నిర్మల హిందూపూర్‌కు తనను దత్తత ఇచ్చినపుడు చాలా మంది ఏంటో అనుకున్నారు. 500 చెరువులు నింపాలని వర్క్ చేస్తున్నాను. పర్సనల్ గా నా లైఫ్ స్టోరీ తెరపై చూసుకున్నట్లు ఉంది. యువతకు రైతుల పట్ల, గ్రామల పట్ల అవగాహన ఉండాలి, తమ సంపాదనలో ఎంతో కొంత తమ సొంత గ్రామాలకు ఇవ్వాలి అన్నారు.


English summary
Actor Krishna watches Srimanthudu Movie at Prasad Labs, Hyderabad. Superstar Krishna, Vijaya Nirmala, Vijaya Naresh graced the event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu