»   » నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఆడియో రిలీజ్ డేట్

నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఆడియో రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని హీరోగా అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి డైరక్షన్ ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ' టైటిల్ ఖరారు చేస్తూ ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. తాజాగా ఆడియో రిలీజ్ డేట్ ప్రకటించారు.

సంక్రాంతి పండగ తర్వాత జనవరి 18న ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాని ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట. గతంలో ఈ సినిమాకు ‘జై బాలయ్య' అనే టైటిల్‌ వినిపించింది. అయితే ఈ టైటిల్ ఒక వర్గానికి చెందినదిగా ఉండటంతో 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' గా మార్చారు.


Krishnagaadi Veera Premagadha Audio Release date

త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాకు గానూ...నాని తన రెమ్యూనరేషన్ 4 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు చెప్పుకంటున్నారు సమాచారం. నిజమైతే...ఇదే ప్రస్తుతానికి నాని కెరీర్ లో ది బెస్ట్ రెమ్యూనరేషన్ అవుతుంది . ఈ సినిమా రోమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా రూపోందుతోంది.


14 రీల్స్ పతాకంపై రూపొందుతోందుతున్న ఈ సినిమాకు అనిల్ సుంకర్ నిర్మాత. అనంతపుతం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథ ఇది. ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారు. నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఆ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.


నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ ప్రతాప్, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

English summary
Nani's Krishnagaadi Veera Premagadha audio to be out on January 18th on the occasion of Sankranthi. Vishal Chandrasekhar is the director of this film.
Please Wait while comments are loading...