»   » ప్రభాస్ వస్తాడో, రాడో... అంటున్న కృష్ణం రాజు

ప్రభాస్ వస్తాడో, రాడో... అంటున్న కృష్ణం రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో గోదావరి పుష్కరాలు మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో గోదావరి నదితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గోదావరి గుర్తొచ్చినా, గోదారమ్మ పాట విన్నా ఎంతో హాయిగా ఉంటుందని, తన చిత్రాలు బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, భక్త కన్నప్ప సినిమాలు పూర్తిగా గోదావరి ప్రాంతాల్లోనే రూపుదిద్దుకున్నాయన్నారు.

ప్రభాస్ నటించిన ‘బాహుబలి' చిత్రానికి సంబంధించిన వ్యవహారాల వల్ల కొంచెం బిజీగా ఉన్నాను. 19వ తేదీన పుష్కర స్నానాలకు వస్తాను. రాజమండ్రి, కొవ్వూరు ఘాట్లలో పుష్కర స్నానం చేసి నరసాపురం చేరుకుంటాను అని కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు మూడు సార్లు పుష్కర స్నానం చేసాను. ప్రభాస్ నాతో కలిసి ఒకసారి పుష్కర స్నానం చేసారు. ఈ సారి వస్తాడో రాడో చెప్పలేను అన్నారు.


Krishnam Raju about Pushkarsas

త్వరలో గోదావరిపై షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నట్లు వెల్లడించిన కృష్ణం రాజు అందరికీ గోదావరి పుష్కర శుభాకాంక్షలు తెలిపారు. గోదావరి నది ప్రక్షాళనకు తన వంతు కృషి చస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

English summary
Krishnam Raju says: “ Prabhas once came to the Pushkarsas and took a holy dip with me in Godavari river but right now all of us are busy with the release of Baahubali on the July 10. This time I doubt if he would come.”
Please Wait while comments are loading...