twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిమ్స్‌లో చేరిన సినీనటుడు కృష్ణంరాజు

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కార్డియాలజీ విభాగంలో యాంజియోప్లాస్టీ చికిత్సను అందించారు. గుండెలోని రక్తనాళాల్లో పూడికలు రావడంతో రెండు స్టంట్లను అమర్చారు. ఈ చికిత్సను డాక్టర్‌ శేషగిరిరావు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు నిమ్స్‌ అధికార వర్గాలు తెలిపాయి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించినాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఆ తరువాత 13 వ లోక్‌సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించినాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయాడు.

    Krishnam Raju admitted at Nims for health issues

    కృష్ణంరాజు గారి కెరీర్ విషయానికి వస్తే...

    ఒకప్పటి యాంగ్రీయంగ్ మెన్ హీరో... కృష్ణంరాజు చాలా కాలం నుంచీ మెగాఫోన్ చేతపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందునిమిత్తం ఆయన సినిమాలు కూడా కూడా తగ్గించుకున్నారు. ఆయన దర్శకత్వంలో ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. కృష్ణంరాజు దీన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దబోతున్నారు. యూత్ పాలిటిక్స్ నేపథ్యంలో ఆయన ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చాలా కాలంగా ఆయన ఈ కథపై కసరత్తులు చేస్తున్నారు.

    ఇక కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ 'గోపీకృష్ణా మూవీస్'లోనే ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం 'ఒక్క అడుగు' అనే టైటిల్‌ని అప్పట్లో ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేశారు. 'ఛత్రపతి' సినిమాలో ప్రభాస్ 'ఒక్క అడుగు' అంటూ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ బాగా పాపులరైన విషయం తెలిసిందే. అయితే ఒక్క అడుగు చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ కృష్ణం రాజు గారికి అది ఇష్టమైన ప్రాజెక్టు కావటంతో మళ్ళీ ఏ క్షణమైనా మొదలు కావచ్చు అంటున్నారు.

    కృష్ణం రాజు మాట్లాడుతూ...ఇప్పటివరకూ హీరోగా 150కు పైగా సినిమాలు చేశాను. నిర్మాతగా ఎన్నో విలువైన చిత్రాలు నిర్మించాను. కేంద్రమంత్రిగా పదిహేను నెలలు సేవలందించాను. ఈ మూడు విభాగాల్లోనూ నా పాత్రను సంతృప్తికరంగా పోషించాను. ఇక మిగిలింది దర్శకత్వం. త్వరలో ఆ పని కూడా పూర్తి చేస్తాను అన్నారు డా.కృష్ణం రాజు. ఇకపై కూడా ఇదే రీతిలో తమ సంస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేసే విధంగా మంచి చిత్రాలు నిర్మిస్తాను అన్నారు.

    అలాగే ఆదివారాలు కూడా విశ్రాంతి తీసుకోకుండా రాత్రింబవళ్లు పని చేస్తూ ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేవాణ్ని. కొన్ని నా ఇమేజ్‌ను పెంచుకోవడం కోసం చేస్తే, మరికొన్ని పరిశ్రమ బాగు కోసం చేశాను. మనం ఒక సినిమా చేస్తే కొన్ని వందల కుటుంబాలకు పని దొరుకుతుంది. నేను చేసిన సినిమా టీవీలో చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది.

    ఇన్ని గొప్ప సినిమాలు చేశానా...అని మనసు పులకించి పోతోంది. ఇప్పట్లోలాగా కథల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసింది లేదు. సినిమా చేయడానికి నెల రోజుల ముందు కథ వినేవాణ్ని అంతే. ఒకే ఒక్క సినిమా మాత్రం కథ వినకుండా ఆ దర్శకుడి మీద నమ్మకంతో చేశాను. అదే 'కటకటాల రుద్రయ్య'..అంటూ చెప్పుకొచ్చారు. ఆయన త్వరగా కోలుకుని తాను దర్శకత్వం చేయబోయే చిత్రం కూడా హిట్టు కావాలని కోరుకుందాం.

    English summary
    Senior actor Krishnam raju admitted at Nims for heart problem. Krishnam Raju starred in more than 183 Telugu films in his career and was a prominent actor of the 1970s and 1980s in Tollywood. He entered the films in 1966 with Chilaka Gorinka produced and directed by Kotayya Pratyagatma. He won 5 Filmfare Awards and 2 Nandi Awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X