»   » ప్రభాస్, నేను కలిసి నటించే మల్టీస్టారర్ ఇది

ప్రభాస్, నేను కలిసి నటించే మల్టీస్టారర్ ఇది

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   Krishnam Raju plans to direct nephew Prabhas
  హైదరాబాద్ : ప్రభాస్, నేను కలిసి నటించే మల్టీస్టారర్ సినిమా ఇది. అనినీతికి సంబంధించిన కథతో రూపొందిస్తున్నాం. అంటే అవినీతిని గురించి చెప్పే సినిమా కాదు. దాని మూలాలు ఎక్కడున్నాయో, మూలాలతో సహా పెకలించి వేయాలంటే ఏం చేయాలో చెప్పే సినిమా. కథ మొత్తం సిద్ధమైంది అన్నారు కృష్ణం రాజు. ఆయన పుట్టిన రోజు సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

  అలాగే... నా దర్శకత్వంలోనే 'ఒక్క అడుగు' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాను. అవినీతి మూలాలు ఎక్కడున్నాయన్న విషయాన్ని స్పృశిస్తూ తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు నేను కూడా ఓ కీలక పాత్రలో నటించబోతున్నాను. ఒక్క అడుగు ముందుకేస్తే వెనక లక్షల అడుగులు పడతాయని చెప్పే ఓ మంచి సందేశాత్మక చిత్రమిది. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి అంటున్నారు కృష్ణం రాజు.

  ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. ఓ నటుడికి జీవితంలో ఎప్పుడో కానీ రాని అవకాశం ప్రభాస్‌కు చాలా త్వరగా వచ్చింది. ఆ సినిమా కోసం ఓ నటుడు తన రెండేళ్ల కాలాన్ని వెచ్చించడం సబబే. ఆ సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి ఆ టీమ్‌కు దక్కడం ఖాయం. ప్రభాస్ ఈ ఏడాది ఆ సినిమాతో పాటు 'ఒక్క అడుగు'లోనూ నటిస్తాడు అన్నారు.

  ఇక అంతర్జాతీయస్థాయి చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్‌. 'బాహుబలి' కోసం చాలా కష్టపడుతున్నాడు. తనని చూసి గర్వపడుతున్నా . రాజమౌళితో ఇదివరకు 'ఛత్రపతి' చేశాడు. అది చక్కటి ఆదరణ పొందింది. మరోసారి ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' చిత్రం చేస్తుండడం ఆనందంగా ఉంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తవ్వగానే ప్రభాస్‌కి పెళ్లి చేయబోతున్నాం అన్నారు. ప్రభాస్‌తో 'భక్తకన్నప్ప' సినిమా తీయాలనే ఆలోచన కూడా ఉందని ఆయన చెప్పారు.

  2015లో తన పెళ్లి గురించిన శుభవార్తను చెబుతాం. ఇంకా అమ్మాయిని చూడటం మొదలుపెట్టలేదు. ప్రభాస్‌తో 'భక్త కన్నప్ప' సినిమాను నేనే రీమేక్ చేస్తానని కూడా ఇంతకు ముందు చెప్పాను. ఆ ప్రాజెక్ట్ కూడా పైప్‌లైన్‌లో ఉంది. మరోవైపు బుల్లితెరకు కూడా సీరియళ్లను చేయాలని ఉంది. శనిభగవంతుడి మంచితనాన్ని తెలుపుతూ 'ఈశ్వరుడు-శనీశ్వరుడు' అనే సీరియల్‌ను తెరకెక్కించాలనుకుంటున్నాం అని తెలిపారు.

  English summary
  "Prabhas and I will come together for this film. The script is finalised and I have also found a producer. We plan to take the film on floors this year and I might direct it as well if I don't find someone who shares my sensibilities about the film," Krishnam told . "The title in my film refers to the step you take against corruption. It literally translates to 'one step'. I think that's that step that makes anyone a leader. It's not inspired by any of Prabhas's film dialogues," he said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more