For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు ఊహించని కామెంట్స్: అప్పుడే జరుగుతుందని బాంబ్ పేల్చిన రెబెల్ స్టార్

  |

  రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు ప్రభాస్. 'ఈశ్వర్' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో క్రేజ్‌ను అందుకున్నాడు. ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిన ఈ హీరో.. వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. అతడి పెదనాన్న కృష్ణంరాజు తాజాగా దీనిపై స్పందించారు. ఆ వివరాలు మీకోసం!

  Adipurush Update From Prabhas | Filmibeat Telugu
  ఆ రెండింటితో హాట్ టాపిక్ అయిన ప్రభాస్

  ఆ రెండింటితో హాట్ టాపిక్ అయిన ప్రభాస్

  ‘బాహుబలి'తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి చిత్రం ‘సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశాడు. తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో నిరాశ పరిచిన ఈ మూవీ.. హిందీలో మాత్రం సత్తా చాటింది. అక్కడ సూపర్ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసి రికార్డులు క్రియేట్ చేసింది.

  తొలిసారి రొమాంటిక్ యాంగిల్ చూపిస్తాడు

  తొలిసారి రొమాంటిక్ యాంగిల్ చూపిస్తాడు

  ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్'. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. వేసవిలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

  ఎప్పుడో ప్రకటించాడు.. మొదలు కాలేదు

  ఎప్పుడో ప్రకటించాడు.. మొదలు కాలేదు

  ‘రాధే శ్యామ్' పట్టాలపై ఉండగానే ప్రభాస్.. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించబోయే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేయనుంది. టైం మెషీన్ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా ‘ఆదిత్య 369'కు సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది.

  బాలీవుడ్ సినిమాను ప్రకటించిన ప్రభాస్

  బాలీవుడ్ సినిమాను ప్రకటించిన ప్రభాస్

  నాగ్ అశ్విన్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ప్రభాస్ మరో ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. అదే.. ‘ఆదిపురుష్' అనే హిందీ చిత్రం. ఓం రౌత్ రూపొందించనున్న ఈ సినిమాతో అతడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. టీ సిరీస్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో రాబోతుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.

  పవర్‌ఫుల్ సినిమాను ప్రారంభించేశాడుగా

  పవర్‌ఫుల్ సినిమాను ప్రారంభించేశాడుగా

  ‘కేజీఎఫ్' మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ‘సలార్'లోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. లేటుగా ప్రకటించిన అన్నింటికంటే ముందే అంటే ఇటీవలే ప్రారంభించాడు. హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.

  ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు ఊహించని కామెంట్స్

  ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు ఊహించని కామెంట్స్

  జనవరి 20న రెబెల్ స్టార్ కృష్ణంరాజు పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన రాజకీయ, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు. అదే సమయంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాలపైనా స్పందించారు. దీనితో పాటు అతడి వివాహం గురించి ఎవరూ ఊహించని కామెంట్స్ చేసి షాకిచ్చారు.

  అప్పుడే జరుగుతుందని బాంబ్ పేల్చారు

  అప్పుడే జరుగుతుందని బాంబ్ పేల్చారు

  ఈ ఇంటర్వ్యూలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు సార్' అని కృష్ణంరాజును యాంకర్ ప్రశ్నించాడు. దీనికి ‘ఎప్పుడు జరిగితే అప్పుడే' అంటూ ఊహించని సమాధానం ఇచ్చారాయన. ఆ తర్వాత దీనిపై వివరిస్తూ.. ‘వాడి పెళ్లి గురించి మీ అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. చూద్దాం ఎప్పుడు జరుగుతుందో' అంటూ చెప్పుకొచ్చారు కృష్ణంరాజు.

  English summary
  Uppalapati Venkata Suryanarayana Prabhas Raju (born 23 October 1979), known mononymously as Prabhas, is an Indian film actor. One of the highest-paid actors of Indian cinema, Prabhas has featured in Forbes India's Celebrity 100 list three times since 2015 based on his income and popularity.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X