Just In
- 3 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- 3 hrs ago
త్రివిక్రమ్-రామ్ సినిమా.. అది అతడినే అడగాలి.. స్రవంతి రవికిశోర్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
‘భూమి’పై కాజల్ వీడియో.. జయం రవి కోసం స్పెషల్ పోస్ట్
- 5 hrs ago
దానికి సరైన సమయమిదే అంటోన్న సునీత.. పెళ్లయ్యాక పూర్తిగా మారినట్టుందే!!
Don't Miss!
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రభాస్ ఎప్పుడూ ఇక్కడ ఉండడు: సీక్రెట్ రివీల్ చేసిన కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - శ్రద్దా కపూర్ కాంబినేషన్‌లో సుజిత్ తెరకెక్కించిన సినిమా 'సాహో'. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ఏ, విక్రమ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తెలుగు రాష్ట్రాల్లో సందడి
సాహో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ సందడిగా మారాయి. ప్రభాస్ అభిమానుల కోలాహలంతో అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇక, ఇదే రోజు ‘సాహో'ను ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి చూశారు. హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్‌లో ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని ఆమె సినిమాను తిలకించారు. అంతకంటే ముందు థియేటర్ వద్ద శ్యామలా దేవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నారు.

రిపోర్టులు వస్తున్నాయి
సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయని శ్యామలా దేవి చెప్పారు. అంతేకాదు, ‘సాహో సినిమా ఫలితంపై హ్యాపీగా ఉన్నాము. గురువారం రాత్రి నుంచే సినిమా రిపోర్టులు వస్తున్నాయి. అందరూ బాగుంది అంటున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో ఉందని చెబుతున్నారు. దీంతో అందరం చాలా సంతోషంగా ఉన్నాము' అని శ్యామలా దేవి తెలిపారు.

అందరూ ప్రభాస్ గురించే మాట్లాడుతున్నారు
ప్రీమియర్ షోలలో ఈ సినిమా చూసిన వారందరూ ఫోన్లు చేస్తున్నారని శ్యామలా దేవి చెప్పారు. ‘సినిమా చాలా బాగుందని ఫోన్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ ఎంతో అందంగా ఉన్నాడు. పాటలు బాగున్నాయి. ఫైట్స్ కూడా సూపర్‌గా ఉన్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు' అని ఆమె వెల్లడించారు.

అది ప్రభాస్ గొప్పదనం
అలాగే, ఈ సినిమా వెనుక ఉన్న కొన్ని విషయాలను కూడా ఆమె మీడియాతో పంచుకున్నారు. ‘అసలు చిన్న డైరెక్టర్‌కు ప్రభాస్ అవకాశం ఇవ్వడమే గొప్ప విషయం. ఇంటర్నేషనల్ హీరో అయి ఉండి చిన్న దర్శకుడికి అవకాశం ఇవ్వడమనేది ప్రభాస్ గొప్పదనం అనే చెప్పాలి. బాహుబలితో బిగ్ స్టార్ అయిన ప్రభాస్.. సుజిత్‌పై నమ్మకంతో అవకాశం ఇచ్చాడు. దాన్ని అతడు నిలబెట్టుకున్నాడు. చిన్న వయసులోనే సినిమాను చక్కగా మలిచాడని అంటున్నారు' అని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రభాస్ ఎప్పుడూ చూడడు
అలాగే ఈ సినిమాను ప్రభాస్ చూశారా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘బాబు (ప్రభాస్) దుబాయ్‌లో సినిమా చూస్తాడు. రిలీజ్ టైమ్‌లో ఇక్కడ ఉండడు అన్న విషయం తెలుసు కదా. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ అలాగే చేస్తాడు. ఫ్యాన్స్ మధ్య కూర్చుని చూడడం అంటే నాకిష్టం నేను ఇప్పుడు చూస్తాను. కృష్ణంరాజు సార్ కూడా ఇక్కడే సినిమాను చూస్తారు' అని శ్యామలా దేవి వివరించారు.