twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ప్రివ్యూ... (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ హీరో రాణా-గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్'. భారీ అంచనాల మధ్య ఈచిత్రం రేపు(నవంబర్ 30) విడుదలకు సిద్ధం అవుతోంది. క్రిష్ దర్శకత్వం, నయనతా రీ ఎంట్రీ, విభిన్నమైన కాన్సెప్టుతో సినిమా రూపొందడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అంచనాలకు తగిన విధంగా ఈచిత్రాన్ని 1000పైకి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ప్రివ్యూ... (ఫోటో ఫీచర్)

    ఈ చిత్రంలో రాణా థియేటర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. రాణా ఇందులో భారీ మేకప్ లు, విభిన్న వేషధారణతో కనిపించనున్నాడు.

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ప్రివ్యూ... (ఫోటో ఫీచర్)

    రాణా ఫైట్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయి. ఈ సినిమా కోసం స్టంట్స్ చేస్తూ రాణా గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ప్రివ్యూ... (ఫోటో ఫీచర్)

    ఈ చిత్రంలో రాణా అభిమన్యుడు, ఘటోత్కచ, నరసింహమూర్తి గెటప్స్ లో కనిపించనున్నాడు.

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ప్రివ్యూ... (ఫోటో ఫీచర్)

    నయనతార ఈచిత్రంలో డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా నటిస్తోంది.

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ప్రివ్యూ... (ఫోటో ఫీచర్)

    ఈ చిత్రంలో మణిశర్మ కంపోజ్ చేసిన 7పాటలు అద్భుతంగా ఉండనున్నాయి.

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ప్రివ్యూ... (ఫోటో ఫీచర్)

    కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో రెండు ఐటం సాంగులు ఉన్నాయి. ఇందులోని ఓ పాటలో బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రాణా సమీర్ రెడ్డితో స్టెప్పులు వేయనున్నారు.

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ప్రివ్యూ... (ఫోటో ఫీచర్)

    జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ, జెకె మూర్తి ఆర్ట్ డైరెక్షన్, తిరుమల డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, చిత్తూరు శ్రీనివాస్ మేకప్, సాయి మాధవ్ బుర్ర డైలాగులు సినిమాకు అదనపు ఆకర్షణలు.

    ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ప్రివ్యూ... (ఫోటో ఫీచర్)

    నవంబర్ 30 ఈచిత్రం భారీగా విడుదలవుతోంది. ఈ చిత్రం కోసం 1000కి పైగా థియేటర్లు కేటాయించారు.

    సినిమా కథ విషయానికొస్తే....
    ఈ చిత్రం సురభి కళాకారుల బ్యాక్ డ్రాప్‌తో నడుస్తుంది. తర తరాలుగా సురభి నాటకాల థియేటర్ మెయింటేన్ చేస్తున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి బిటెక్ బాబు(రాణా దగ్గుబాటి). బాగా చదువుకున్న బిటెక్ బాబుకు డ్రామా కంపెనీ బిజినెస్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. విదేశాలకు వెళ్లి ఏదైనా సాధించాలనే తపనతో ఉంటాడు. అయితే బిటెక్ బాబు తాత(కోట శ్రీనివాసరావు) అతని నిర్ణయంపై అసంతృప్తిగా ఉంటాడు. డ్రామా కంపెనీని తన చేతుల్లోకి తీసుకుని నడిపించాలని ఒత్తిడి తెస్తుంటాడు.

    డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, రిపోర్టర్ అయిన దేవిక(నయనతార) తన జీవితంలోకి రావడంతో బిటెక్ బాబు ఆలోచనల్లో పూర్తిగా మార్పు వస్తుంది. ఆ తర్వాత బిటెక్ బాబు ఏం చేసాడు అనే ఆసక్తికర అంశాలు తెరపై చూడాల్సిందే.

    English summary
    Krishnam Vande Jagadgurum (KVJ) is a high-octaine action movie, which has been directed by Gamyam and Vedam fame Krish aka Radhakrishna Jagarlamudi. Rana Daggubati and Nayantara are playing the lead roles, while Milind Gunaji, Murali Sharma, Brahmanandam, Kota Srinivasa Rao and Kishore appear in other important roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X