twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కృష్ణం వందే జగద్గురుమ్‌' విడుదల తేదీ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్: దగ్గుబాటి రాణా, నయనతార కాంబినేషన్ లో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌'. ఈ చిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేద్దామని ప్లాన్ చేసారు. అయితే ఊహించని విధంగా లేటు అవటంతో రిలీజ్ ని మార్చారు. క్రిష్ ఈ చిత్రం విషయమై మీడియాతో మాట్లాడుతూ...''సమాజంలోంచి అల్లుకొన్న కథ ఇది. సమకాలీన అంశాలు తెరపైన కనిపిస్తాయి. వినోదం జోడించడం మర్చిపోలేదు. బీటెక్‌ బాబు, దేవిక పాత్రలు ప్రేక్షకులకు చేరువవుతాయి. '' అన్నారు.

    తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల అవుతుంది. ఈ చిత్రంలో వెంకటేష్,సమీరా రెడ్డి గెస్ట్ లుగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆడియో ఈ మద్యనే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇక చిత్రం స్టోరీ గురించి క్రిష్ చెపుతూ... రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా బతకాల్సిందే అంటాడు బీటెక్‌ బాబు. పుస్తకాల కంటే లోకాన్నే అతను ఎక్కువగా చదివాడు. ఈ సంఘంలో బతకాలంటే 'చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష' అనుకోవడంలో తప్పులేదని వాదిస్తాడు. అలా ఉండటాన్ని స్వార్థం అనడంలో అర్థం లేదన్నది అతని వాదన. అయితే బాబు ఆలోచనలు దేవికతో పరిచయం తరవాత మారాయి. అదెలాగో మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు క్రిష్‌.

    అలాగే.. ఈ చిత్రం లాండ్ మాపియా నేఫధ్యంలో వాస్తవ సంఘటనలు ఇన్ కార్పోరేట్ చేస్తూ జరుగుతుంది.తమిళ నాడు, కర్ణాటక బోర్డర్ లో కథ జరుగుతుంది. ఈ సినిమాతో నేను ఓ కొత్త జనర్ ని ట్రై చేస్తున్నాను. ఈ చిత్రం ట్రావిల్ ఎడ్వెంచర్ ఫిల్మ్. ఇందులో రాణా ధియోటర్ ఆర్టిస్టుగా, స్వార్ద పరుడుగా కనపిస్తే... నయనతార డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా స్వార్దం లేని వ్యక్తిత్వంతో కనిపిస్తుంది అన్నారు. ఈ చిత్రంలో రాణా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందంటున్నారు దర్శకుడు క్రిష్. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...''మనిషి డబ్బుతో పాటు నడుస్తున్నాడో, డబ్బే మనిషిని నడిపిస్తుందో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నాం. మా బీటెక్‌ బాబు ఎలా నడిచాడన్నది సస్పెన్స్‌. నొప్పింపక, తానొవ్వక నెగ్గుకొస్తుంటాడు. కథకీ, కృష్ణ తత్వానికీ ఉన్న సంబంధం ఆసక్తికరం'' అన్నారు.

    ఈ చిత్రంలో రాణా పేరు బాబు. చదివింది బీటెక్‌. అందుకే అన్నీ హైటెక్‌ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రాణా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌, సంగీతం: మణిశర్మ.

    English summary
    Daggubati Rana's forthcoming action drama film ‘Krishnam Vande Jagadgurum (KVJ)’ is being scheduled to release on November 9th, 2012. Sources close to the production house indicate that the makers are planning to eye the above date, as the movie is nearing completion of post-production works.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X