»   »  నెలాఖరున కృష్ణార్జున

నెలాఖరున కృష్ణార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nagarjuna with Vishnu
ప్రముఖ నటుడు మోహన్ బాబు నిర్మాతగా శ్రీ లక్ష్మీప్రసన్న ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం కృష్ణార్జున ఈ నెలాఖరున విడుదల కానున్నది. ఈ విషయాన్ని మోహన్ బాబు వెల్లడించారు. ఈ సినిమాలో నాగార్జున, విష్ణువర్ధన్, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తనది చిన్న పాత్రే అయితా అతి ముఖ్యమైన పాత్ర అని మోహన్ బాబు అన్నారు. తనది ఈ సినిమాలో ముఖ్యమైన క్యారెక్టర్ అని నాగార్జున చెప్పుకున్నారు. విష్ణువర్ధన్ మదిలో మెదిలిన పాత్ర అని ఆయన అన్నారు. నాగార్జునతో కలిసి నటించడం తన అదృష్టమని విష్ణు అన్నారు. ఈ సినిమా షూటింగ్ బుధవారంనాడు ముగిసింది. ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ నటించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X