»   » అసలే కష్టాల్లో నాని సినిమా.. పైగా తెలంగాణ ఆర్టీసీ దెబ్బ, కేటీఆర్ ఫైర్!

అసలే కష్టాల్లో నాని సినిమా.. పైగా తెలంగాణ ఆర్టీసీ దెబ్బ, కేటీఆర్ ఫైర్!

Subscribe to Filmibeat Telugu

నాని నటించిన తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. 8 వరుస విజయాలు తరువాత నాని నటించిన చిత్రం ఇది. మంచి అంచనాలతో ఈ చిత్రం విడుదలైంది. కానీ అభిమానుల నుంచి, సినీ క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి భిన్నమైన స్పందన వస్తోంది. నాని జైత్ర యాత్రకు ఈ చిత్రం అడ్డుకట్ట వేసిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాని ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించడంతో విడుదలకు ముందు మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. రుక్సార్ మీర్, అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. అసలే కష్టాల్లో ఉన్న నాని చిత్రానికి తెలంగాణ ఆర్టీసీ కూడా దెబ్బేసింది. దీనితో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు.

Krishnarjuna Yuddham Collections Finding a Bit Tough
ఎనిమిది విజయాల తరువాత

ఎనిమిది విజయాల తరువాత

ఇటీవల టాలీవుడ్ లో వరుసగా హిట్లు కొడుతున్న ఏకైక హీరో నాని. ఎంసీఏ చిత్రం వరకు నానికి వరుసగా హిట్లు దక్కాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన నాని కృష్ణార్జున యుద్ధం చిత్రానికి అభిమానుల నుంచి, క్రిటిక్స్ నుంచి భిన్నమైన స్పందన వస్తోంది.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో

ఈ చిత్రానికి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. నానిని ద్విపాత్రాభినయంలో చూపించాడు. కృష్ణ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కలెక్షన్ల ఎదురీత

కలెక్షన్ల ఎదురీత

కృష్ణార్జున యుద్ధం చిత్రానికి భిన్నమైన స్పందన వస్తుండడంతో ఆప్రభావం కలెక్షన్ల పై పడింది. ఏప్రిల్ 20 సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను చిత్రం విడుదల కాబోతుండడంతో.. కృష్ణార్జున యుద్ధం చిత్రం వీలైనంత ఎక్కువగా ఈ లోపు వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

తెలంగాణ ఆర్టీసీ దెబ్బ

తెలంగాణ ఆర్టీసీ దెబ్బ

అసలే కృష్ణార్జున యుద్ధం పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. పుండు మీద కారంలా తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఈ చిత్ర పైరసీ ప్రదర్శిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

కేటీఆర్ ఫైర్

ఈ విషయాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా మంత్రి కేటీర్ కు తెలియజేయడంతో ఆయన ఆర్టీసీపై మండిపడ్డారు. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులని ఆదేశించారు.

English summary
Krishnarjuna Yuddam Pairacy movie played in RTC bus. Minister KTR fires on TSRTC
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X