Related Articles
విక్రమ్ కుమార్‌తో నాని.. అలాంటి కథ నాని చేస్తాడా!
ఒక దర్శకుడికి నాని ఝలక్ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్!
అసలే కష్టాల్లో నాని సినిమా.. పైగా తెలంగాణ ఆర్టీసీ దెబ్బ, కేటీఆర్ ఫైర్!
నాని ‘కృష్ణార్జున యుద్ధం’ కలెక్షన్స్ పరిస్థితి ఇది... లాభాల్లోకి రావాలంటే ఇంకా?
కలెక్షన్ రిపోర్ట్: చిట్టిబాబు జోరును ఆపలేక పోతున్న ‘కృష్ణార్జున యుద్ధం’
ఆకాంక్ష సింగ్‌తో కింగ్ నాగార్జున రొమాన్స్.. నాని ఆమెతో..
కృష్ణార్జున యుద్ధం తొలిరోజు కలెక్షన్లు.. కృష్ణ అండతో!
‘కృష్ణార్జున యుద్ధం’ యూఎస్ఏ కలెక్షన్ రిపోర్ట్: ఎంసీఏ కంటే వెనకే....
కృష్ణార్జున యుద్ధం సినిమా రివ్యూ: మాస్ టచ్‌తో నాని
ట్విట్టర్ రివ్యూ : కృష్ణార్జున యుద్ధం.. నాని ఫెర్ఫామెన్స్ కేక.. కానీ!
బిగ్‌బాస్2పై నాని క్లారిటీ.. ఎన్టీఆర్ చేయకపోవడంపై క్లారిటీ అదేనట..
హిట్ కొడితే ఎవడూ పట్టించుకోవడం లేదు.. ఫ్లాప్ వస్తేనే న్యూస్ అవుతుందేమో..
సింగిల్ కట్ కూడా లేదు: నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సెన్సార్ రిపోర్ట్
న్యాచురల్ స్టార్ నాని వరుస హిట్లతో టాలీవడ్ లో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నాడు. నాని వరుసగా 8 హిట్స్ సొంతం చేసుకున్నాడు. నాని తాజాగా నటించిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మరియు ఎక్స్ ప్రెస్ రాజా వంటి చిట్ చిత్రాలని రూపొందించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. నాని ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటిస్తుండడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ ఈ చిత్రంలో హీరోయిన్లు గా నటించారు. ఈ చిత్ర పాటలు, ట్రైలర్ ఆకట్టుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్ర నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ప్రీమియర్ షో ఈ చిత్రంపై అభిమానుల స్పందన ఎలా ఉందొ చూద్దాం.
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు
గత 8 చిత్రాలుగా బాక్స్ ఆఫీస్ వద్ద నాని జైత్ర యాత్ర కొనసాగుతోంది. నాని వరుస హిట్లతో తిరుగులేకుండా దూసుకుపోతున్నాడు. నాని నటించిన చిత్రాలు నిర్మాతలకు అలవోకగా లాభాలు తెచ్చిపెడుతున్నాయి.
కృష్ణార్జున యుద్ధం చిత్రంతో
నాని తాజాగా నటించిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయంలో నటించడం విశేషం. చివరగా నాని జెంటిల్ మాన్ చిత్రంలో డ్యూయల్ రోల్ లో నటించాడు.
దర్శకుడు అతడే
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నా మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ ఈ చిత్రంలో హీరోయిన్లు గా నటిస్తున్నారు.
నేడు ప్రేక్షకుల ముందుకు
ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న నానికి అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. కృష్ణార్జున యుద్ధం ప్రీమియర్ షోల ప్రదర్శన యుఎస్ లో ఇప్పటికే పూర్తయింది.
నాని ఫెర్ఫామెన్స్ తో ఎప్పటిలాగే
నాని తన నటనతో ఎప్పటిలాగే ఈ చిత్రంలో కూడా అదరగొట్టాడు. ద్విపాత్రాభినయం నాని నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడం నాని ప్రత్యేకత.
ఫస్ట్ హాఫ్ అలా సాగింది
ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. పాటలు కూడా బావున్నాయి. మంచి హాస్యభరితమైన సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది.
చిత్తూరు స్లాంగ్ లో కృష్ణ
ఈ చిత్రానికి ప్రధాన బలం నాని కృష్ణ పాత్ర. నాని చిత్తూరు యాసలో మాట్లాడుతూ చాలా బాగా ఎంటర్ టైన్ చేశాడు.
సెకండ్ హాఫ్ పరిస్థితి ఇది
ఈ చిత్రానికి ప్రధానమైన మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మొత్తం పరవాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులని మెప్పించే విధంగా లేదు. ముఖ్యంగా నాని రాక్ స్టార్ పాత్ర అతడికి సెట్ కాలేదు. కథ కథనం పై దర్శకుడు ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది.
నాని అభిమానులకు మాత్రమే
నాని నటన ఇష్టపడే వారు మాత్రమే ఈ చిత్రాన్ని ఆస్వాదించగలుగుతారు. మిగిలిన ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై చిత్ర రిజల్స్ ఆధారపడి ఉంటుంది. హిప్ ఆప్ సంగీతం బావుంది.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.