»   » సునీల్... కెరీర్లో ఇలా జరిగి చాలా కాలం అయింది!

సునీల్... కెరీర్లో ఇలా జరిగి చాలా కాలం అయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చక్కటి డాన్సులతో, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ హీరో గా, వాసు వర్మ దర్శకత్వం లో ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న చిత్రం "కృష్ణాష్టమి" ఈ చిత్రం ఫిబ్రవరి 19 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14 వ తేదీన ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. సునీల్ కు సంబంధించిన సినీ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగి చాలా కాలం అయింది.

" కేరింత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సూపర్ సక్సెస్ ని అందించాయి. ఈ రెండు విజయాల అనంతరం వస్తోన్న చిత్రం కృష్ణాష్టమి. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుని మా బ్యానర్ కి హ్యాట్రిక్ విజయం దక్కుతుంది అన్న నమ్మకం ఉంది", అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

Krishnashtami Platinum Disc on Feb 14th

దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫమిల్య్ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్". సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, రాజన్ మోడీ, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఈ చిత్రం లో ఉన్నారు.

దర్శకత్వం - స్క్రీన్ప్లే -వాసు వర్మ, నిర్మాత - రాజు, సహ నిర్మాతలు - శిరీష్, లక్ష్మణ్, ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు, ఎడిటర్ - గౌతం రాజు, సంగీతం - దినేష్, కథ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం, ఫైట్ మాస్టర్ - అనల్ అరసు, ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్, నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

English summary
Sunil's Krishnashtami Platinum Disc on Feb 14th Hero Sunil's upcoming family entertainer, 'Krishnashtami', is all set for a release on February 19th. The movie's Platinum Disc function will be held on Feb 14th in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu