»   »  రాధిక ఆప్టేకు చురకలంటేలా క్రితి సనన్ కామెంట్స్

రాధిక ఆప్టేకు చురకలంటేలా క్రితి సనన్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో ‘రక్త చరిత్ర', ‘ధోని', ‘లెజెండ్' తదితర తెలుగు చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముంబై భామ రాధిక ఆప్టే. ఇటీవల రాధిక ఆప్టే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక తెలుగులో తప్ప మిగతా అన్ని రీజనల్ లాంగ్వేజీల్లోనూ వర్క్ బాగా ఎంజాయ్ చేసానని, తెలుగు సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువ అంటూ కామెంట్ చేసింది. ‘తెలుగు సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువ. వారు అహంకార పూరితంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో నన్ను చాలా బ్యాడ్ గా ట్రీట్ చేసారు అని వ్యాఖ్యానించారు.

గతంలో ఏ ముంబై హీరోయిన్ కూడా తెలుగు సినీ పరిశ్రమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాధిక ఆప్టే అసలు ఇలా ఎందుకు కామెంట్ చేసిందో ఎవరికీ అర్థం కాలేదు. ‘లెజెండ్' సినిమా సమయంలో రాధిక ఆప్టేకు మా టీం ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఆమె వర్క్‌కు ఇంప్రెస్ అయిన అంగ్రిమెంటు కంటే ఎక్కువ మొత్తమే చెల్లించామని తెలిపారు. ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసిందో తెలియదన్నారు. ‘లయన్' దర్శకుడు సత్యదేవ మాట్లాడుతూ...అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిందో? ఎవరిని ఉద్దేశించి చేసిందో అని అయోమయం వ్యక్తం చేసారు.

తాజాగా ముంబై భామ, 1-నేనొక్కడినే హీరోయిన్, ప్రస్తుతం నాగ చైతన్య సరసన ‘దోచేయ్' చిత్రంలో నటిస్తున్న క్రితి సనన్......తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో వాతావరణం చాలా బావుంటుంది. నేను పని చేసిన రెండు సినిమాలకు అందరూ చాలా సహకరించారు, ఎక్కడ నాపై వివక్ష చూపలేదు అని స్పష్టం చేసింది. తెలుగు సినీ పరిశ్రమపై అబాండాలు వేసిన రాధిక ఆప్టేకు....క్రితి సనన్ తన కామెంట్స్ తో చురకలంటించిందని అంతా చర్చించుకుంటున్నారు.

English summary
"There's nothing like sidelining a heroine for the sake of hero. I've been always treated well by Telugu folks. They give lot of respect, committed towards work and help-centric", says Kriti Sanon.
Please Wait while comments are loading...