»   » తన సినిమా పైరసీ దొంగను పట్టుకున్న హీరోయిన్

తన సినిమా పైరసీ దొంగను పట్టుకున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : రీసెంట్ గా విడుదలైన ‘దిల్ వాలే' చిత్రం లో హీరోయిన్ గా కీర్తి సనన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పైరసీ వెర్షన్ ని ఆమె రీసెంట్ గా ప్లైట్ లో పట్టుకుంది. ఈ మేరకు ఆ మె ట్వీట్ చేసింది.

డిల్లీకి ప్లైట్ లో వెళ్తున్నప్పుడు తను కూర్చున్న సీట్ కు కొద్ది దూరంలో ఈ చిత్రం పైరసీ వెర్షన్ చూస్తూ ఓ వ్యక్తి ఆమె కంటపడ్డారు. అతను తల్లితో కలిసి ప్రయాణిస్తున్నాడు. సెల్ లో దిల్ వాలే పైరెటెడ్ వెర్షన్ .. ని ఫోన్ ప్రొజక్టర్ తో చూస్తున్నాడు.

 Kriti Sanon catches a man watching pirated version of ‘Dilwale’

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దీంతో మండిన కీర్తి అతన్ని మర్యాదగా సినిమాని ధియోటర్ లో చూడమని అక్కడైతే బాగా ఎంజాయ్ చేయవచ్చని చెప్పింది. అయితే ఆమె మాటలు పట్టింకోకుండా సినిమా చూడటం కంటిన్యూ చేసాడు.

ఎలా ఆపాలో తెలియని కీర్తి..వెంటనే కొన్ని ఫొటోలు తీసి ట్విట్టర్ ద్వారా షేర్ చేసి బయిట ప్రపంచానికి తెలియచేసింది. పైరసీని ఆపమని ఆమె విజ్ఞప్తి చేసింది.

English summary
Kriti Sanon tweeted, “Someone watchin pirated version of Dilwale in front of me on phone in the flight! Annoyed!! #SayNoToPiracy.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu