షూటింగ్ లో గాయపడ్డ మహేష్ హీరోయిన్, ఫొటో ఇవిగో

రాబ్తా సినీ సెట్ పై హీరోయిన్ కీర్తి సనన్ గాయపడింది.

By Srikanya

ముంబై: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్ నేనొక్కడినే చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కృతి సనన్ గుర్తుంది కదూ. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడ వరసపెట్టి సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ 26 ఏళ్ల బ్యూటీ రాబ్తా అనే బాలీవుడ్ సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్రం షూటింగ్ లో ఆమె గాయపడింది. ఈ విషయాన్ని ఆమె ఇనిస్ట్రగ్రామ్ లో షేర్ చేసింది.

దినేష్ విజన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోండగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. జూన్ 9న విడుదల కానున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే షూటింగ్ లో ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తోండగా కృతిసనన్ కాలికి గాయమైంది. ఆ గాయాన్ని ఫోటో తీసి కృతి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కి నో పెయిన్ నో గెయిన్ రాబ్తా అని హ్యష్ ట్యాగ్ తో పోస్ట్ పెట్టింది.


ఇక కృతి కొన్నాళ్ళుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్ చేస్తోందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్లే అంటూ కొట్టి పారేసింది కృతి. కాని ఆ తర్వాత ఈ జంట అనేక సార్లు కెమెరాకి చిక్కింది. ఆ ఫోటోలు కూడా బయటకు రావడంతో అభిమానులు వీరి ప్రేమ విషయంపై ఓ క్లారిటీకి వచ్చారు.

Kriti Sanon Gets Bruised While Shooting For 'Raabta'

తాజాగా ఈ ప్రేమ జంట లండన్ లో న్యూ ఇయర్ వేడుకలని జరుపుకొని వాటిని సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ పిక్స్ లో వీరు సాన్నిహిత్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. వీరితో పాటు రాబ్టా మూవీ దర్శకుడు దినేష్ విజన్.. అతని సోదరి పూజా విజన్ లు ఉన్నారు. ఈ గ్రూప్ అందరు కలిసి దిగిన పిక్స్ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X