»   » డిఫరెంట్ గా 'దోచేయ్‌' లో కృతి సనన్‌ క్యారక్టర్

డిఫరెంట్ గా 'దోచేయ్‌' లో కృతి సనన్‌ క్యారక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగచైతన్య హీరో గా నటించిన చిత్రం 'దోచేయ్‌'. కృతి సనన్‌ హీరోయిన్. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. ఏప్రిల్‌ 24న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో కృతి సనస్ పాత్ర ఏమటంటే...మెడికల్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించనుంది. మీరా అనే పాత్రలో ఆమె కనిపించనుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
అది టామ్ బోయ్ పాత్ర. ఎప్పుడూ గోడలు ఎక్కటం, సినిమాలు చూడటం, ఛాటింగ్, మెసేజ్ లు పెట్టుకోవటం వంటివి చేస్తూంటుంది. చాలా క్యాజువల్ లుక్ లో ఉంటుంది. ఎప్పుడూ బ్యాగీ టాప్స్, బోయ్ ఫ్రెండ్ జీన్స్ వేసుకు తిరుగుతూంటుంది. ఇదంతా కృతి సనన్ చెప్పుకొచ్చింది. మరో ప్రక్క ఈ చిత్రంలో నాగచైతన్య ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

నిర్మాత మాట్లాడుతూ ''మనం దోపిడీకి గురి కాకూడదంటే ఎదుటివాడిని దోచేయడమే మార్గం అని నమ్మిన ఓ యువకుడి కథ ఇది. నాగచైతన్య అభినయం అందరినీ అలరిస్తుంది. రోజుకొకటి చొప్పున విడుదల చేస్తున్న పాటలకీ, ప్రచార చిత్రాలకీ మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అందరి అంచనాలను అందుకొనేలా ఉంటుంది'' అన్నారు.

Kriti Sanon ’s role in Dochay

అలాగే... నాగచైతన్య హీరోగా స్వామిరారా టీమ్ తో మా బ్యానర్ లో నిర్మిస్తున్న దోచెయ్ చిత్రాన్ని ఏప్రియల్ 24న సమ్మర్ స్పెషల్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం. అలాగే ఏప్రియల్ రెండో వారంలో లహరి మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియోను గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ కు, టీజర్స్ కు ఎక్స్ ట్రార్డనరీ రెస్పాన్స్ వస్తోంది. అభిమానుల ఎక్సపెక్టేషన్స్ రీచ్ అయ్యేలా, మా బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచేలా సుధీర్ వర్మ అద్బుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగ చైతన్య కెరీర్ లోమరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అన్నారు.

ఈ చిత్రంలో చైతన్య ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలో కనిపిస్తాడట. మోసం చేసేవారిని ఘరానా మోసంతో దెబ్బకొట్టే యువకుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. అందుకే దీనికి ‘దోచెయ్‌' అనే టైటిల్‌ను పెట్టినట్లు సమాచారం.

''ప్రతి మోసం వెనుక ఇద్దరుంటారు. ఒకరు మోసం చేసేవాడు. మోసపోయేవాడు. నువ్వు రెండో వాడు కాకుండా ఉండాలంటే, మొదటివాడివి అయ్యితీరాల్సిందే..'' ఈ అంశం చుట్టూ తిరిగే కథే మా చిత్రం అంటున్నారు సుధీర్‌ వర్మ.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణముర ళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్‌., సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌., ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌., ఆర్ట్‌: నారాయణరెడ్డి., కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు., నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌., కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సుధీర్‌వర్మ.

English summary
Playing the role of Meera, a medical college student, hot lady Kriti Sanon says that her bubbly role in Naga Chaitanya’s “Dochay” is going to land her in a big place sure.
Please Wait while comments are loading...