»   » వెండి తెర మీదకి ఇంకో హీరోయిన్ చెల్లెలు

వెండి తెర మీదకి ఇంకో హీరోయిన్ చెల్లెలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేశ్ బాబు సరసన '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది కృతీ సనన్. ఆ తర్వాత నాగచైతన్య సరసన 'దోచెయ్' చిత్రంలో నటించింది. హిందీలో 'హీరో పంతి' ద్వారా పరిచయమైన కృతి ఇటీవల విడుదలైన 'దిల్ వాలే'లో నటించింది. కృతి సనన్ కి ఓ చెల్లెలు ఉంది. తన పేరు నూపుర్ సనన్. అక్కలానే నూపుర్ సూపర్ గానే ఉంటుంది.

ఇప్పుడు నూపుర్ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం నూపుర్ సనన్ ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకోగా, సెట్స్‌కు తన చెల్లెలిని దగ్గరుండి మరి తీసుకెళుతుందట కృతి. గతంలో కాజల్ చెల్లి నిషా, సంజన చెల్లి నిక్కీ గల్రానీ, ఆర్తి అగర్వాల్ చెల్లి అదితి లు వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేక పోయారు.

Kriti Sanon's sister to make her Bollywood debut soon?

అయితే నూపుర్ దగ్గర ఇంకో టాలెంట్ ఉంది. అదేంటంటే. ఈ అమ్మడు అద్బుతమైన సింగర్ కూడా. ఇటీవల విడుదలైన 'దిల్ వాలే' చిత్రంలోని 'జనమ్ జనమ్..' పాటను పాడింది నూపురే. ఈ సాంగ్ తో అందరూ ఈమె ట్యాలెంట్ ని గుర్తించారు. ఈ పాటకు మేకింగ్ సాంగ్ కూడా రిలీజ్ చేయడంతో.. నూపుర్ ను అందరూ గుర్తించారు కూడా.

ఒక్కసారిగా హీరోయిన్ సిస్టర్ కి క్రేజ్ పెరిగిపోయింది. పైగా ఇప్పటికే ఈ సాంగ్ కి యూట్యూబ్ లో 10 లక్షలకు పైగా క్లిక్స్ వచ్చాయంటే. ఈ పాట ఎంతగా ఫేమస్ అయిందో అర్ధమవుతుంది. అన్నిటికీ మించి ఈమె సున్నితమైన వాయిస్ చాలామందికి నచ్చేసింది కూడా.

ఈ పాట విన్నవాళ్లందరూ నూపుర్ వాయిస్ సూపర్ అంటున్నారు. సింగర్ అవ్వాలన్నది నూపుర్ కోరిక అట. చెల్లెలి కోరిక నెరవేరడంతో పాటు, హీరోయిన్ గా ఛాన్స్ కూడా లభించడం పట్ల కృతి చాలా ఆనందంగా ఉంది.

English summary
Kriti Sanon sister Nupoor Sanon giving entry as a heroine
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu