»   » ప్రభాస్ ని తిట్టినట్టే సల్మాన్ నీ తిట్టబోయాడు: ఇలా తాట తీసారు

ప్రభాస్ ని తిట్టినట్టే సల్మాన్ నీ తిట్టబోయాడు: ఇలా తాట తీసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమాల్ ఆర్ ఖాన్ బాలీవుడ్ లో పెద్ద చెప్పుకోదగ్గ నటుడేం కాదు 2008 లో దేశ్ ద్రోహీ అనే ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా తీసి అది కనీస స్థాయి సినిమాకూడా కాదు అనిపించుకున్నాక ఇలా అయితే లాభం లేదనుకున్నాడో ఏమో గానీ ట్విట్టర్ మీద పడ్డాడు. రీసెంట్ గా అలియా భట్ చేసిన ఒక బికినీ షూట్ ఫొటోపై అభ్యంతరకర కామెంట్స్ చేసి, బాలీవుడ్ కోపానికి గురయ్యాడు ఈ ప్రబుద్ధుడు.

ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని

ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని

ఒక సారైతే ఇతగాడి పిచ్చి చేష్టలని భరించలేక బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కలిసి వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వద్దకు వెళ్లి, కమాల్ ఖాన్ ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. ఆ తర్వాత పిచ్చోడు ఏమంటే ఏముంది లే అన్నట్టు వదిలేసారు...

 బాహుబలి

బాహుబలి

ఈ మధ్య కాస్త తగ్గాడు అనుకుంటున్న సమయం లో దేశం మొత్తం ఊగిపోతున్న బాహుబలి మీద నోరు పారేసుకున్నాడు, రాజమౌళి చుతియా అనీ, ప్రభాస్ ఒంటెలా ఉన్నాడనీ అంటూ పిచ్చి వాగుడు వాగాడు. రానాపై కూడా నోరు పారేసుకొన్నాడు. రానాను ఇడియట్, బ్రెయిన్‌ లెస్ అంటూ దూషించాడు.

రానా ఇడియట్‌

రానా ఇడియట్‌

ఇప్పటివరకు ఈ ఇడియట్‌ను కానీ, ఆయన ట్వీట్లను ఫాలో కాలేదు. అయినా నన్ను బ్లాక్ చేసి మతిలేని వ్యక్తి అని నిరూపించుకొన్నాడు అని కమల్ ట్వీట్ చేశాడు. ఆ గొడవకి కూడా రానా స్పందించలేదు అనవసరంగా ఎందుకు విలువలేని వ్యాఖ్యలకు స్పందించటం అన్నట్టు మిన్నకుండి పోయాడు.

సల్మాన్ ని టార్గెట్ చేశాడు

సల్మాన్ ని టార్గెట్ చేశాడు

సల్మాన్ ని టార్గెట్ చేస్తూ మరో సారి వార్తలలోకి ఎక్కాడు. మొన్నటి వరకు బాహుబలి సినిమాపై వ్యంగస్త్రాలు విసిరిన ఈ క్రిటిక్ తాజాగా సల్మాన్ ని టార్గెట్ చేశాడు. ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న ట్యూబ్ లైట్ చిత్రాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. గతంలో సల్మాన్ క్యోంకీ అనే చిత్రంలో మంద బుద్ధి వ్యక్తిగా కనిపించాడు. ఆసినిమా అట్తర్ ఫ్లాప్ అయ్యింది.

ట్యూబ్ లైట్ ఫ్లాపే అవుతుంది

ట్యూబ్ లైట్ ఫ్లాపే అవుతుంది

అయితే ఆ తర్వాత ఇప్పుడు తాజా గా చేస్తున్న ట్యూబ్ లైట్ లోను అదే మాదిరి పాత్ర పోషిస్తున్నాడు, ఈ మూవీ కూడా క్యోంకీ మాదిరిగానే ఈ సినిమా కూడా ఫ్లాపే అవుతుంది అనే కామెంట్స్ చేశాడు కేఆర్కే. అందరూ టాలీవుడ్ ఫ్యాన్స్ ఉన్నంత సాఫ్ట్ గా ఉండరు కదా...

కేఆర్కే కి వార్నింగ్ లు

కేఆర్కే కి వార్నింగ్ లు

దీంతో సల్మాన్ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా కేఆర్కే కి వార్నింగ్ లు ఇచ్చారు. మా అభిమాన హీరోపై తప్పుడు కామెంట్స్ చేస్తే నీ అకౌంట్ హ్యక్ చేస్తామని అని అన్నారు. ముందు సల్మాన్ పై చేసిన తప్పుడు ట్వీట్స్ డిలీట్ చేయాలంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. కేఆర్కే గతంలోను మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

English summary
Bollywood comedian Kamal R khan insulted Salman Khan on Twitter. And what happened next is beyond hilarious
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu