»   » స్టార్ హీరో ట్రైలర్ సంచనలం, ఇప్పటికి 3 మిలియన్లు!

స్టార్ హీరో ట్రైలర్ సంచనలం, ఇప్పటికి 3 మిలియన్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన క్రిష్-3 ఫస్ట్ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే మిలియన్ క్లిక్స్ సొంతం చేసుకుని యూట్యూబులో సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదల కాగానే దాన్ని ఆసక్తిగా చూడటం మొదలు పెట్టారు.

ఈ నెల 5న మధ్యాహ్నం విడుదలైన ట్రైలర్ రెండు రోజులు గడవక ముందే 3 మిలియన్లపైగా(32,26,316) హిట్స్ సొంతం చేసుకుంది. ట్రైలర్ చాలా బాగుందనే టాక్ రావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాకేష్ రోషన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో హృతిక్ రోషన్‌తో పాటు వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Krrish 3

గతంలో బాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ మూవీస్ కోయి మిల్ గయా, క్రిష్ చిత్రాలకు సీక్వెల్‌గా క్రిష్-3 చిత్రం రూపొందుతోంది. హృతి రోషన్ తండ్రి రాకేష్ రోషన్ స్వీయన నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈచిత్రపై భారీ అంచనాలున్నాయి.

గతంలో రూపొందిన రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. క్రిష్-3 చిత్రంలో హృతిక్ రోషన్ సూపర్ మేన్ పాత్రలో కనిపించబోతునప్నాడు. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈచిత్రం విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని ఈ ట్రైలర్ ను బట్టి స్పష్టం అవుతోంది. దీపావళికి ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
The first trailer of superhero franchise Krrish 3 featuring Hrithik Roshan and Priyanka Chopra in the lead has received a roaring response from both fans and the film fraternity. The trailer that was launched monday afternoon has already crossed 3 million views in just two day of its release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu