»   » హృతిక్‌ రోషన్ త్రిపాత్రాభినయం అదుర్స్

హృతిక్‌ రోషన్ త్రిపాత్రాభినయం అదుర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : దీపావళి పండుగ సందర్భంగా బాలీవుడ్‌లో విడుదలయ్యే చిత్రాలపైన దృష్టి పెడతారు సినీ ప్రేక్షకులు. ఈ సమయంలో వెండితెరపైన అలరించే చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకోవడంతో పాటు సంచలన విజయాలను సొంతం చేసుకుని కాసుల వర్షం కురిపించడమే దీనికి కారణం. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా అలాంటి భారీ అంచనాలతో ఒక చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రముఖ హీరో హృతిక్‌ రోషన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఆ చిత్రం 'క్రిష్‌-3'. ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత ఇతడి తండ్రి రాకేష్‌ రోషన్‌ కావడం చెప్పుకోదగ్గ విషయం.

హృతిక్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్‌, వివేక్‌ ఒబెరాయ్‌లు నటించారు. మూడు పాత్రలను పోషించడం తనకు సవాలుగా అనిపించిందని, దీనికి అవసరమైన మేకప్‌ చేయడానికే ఎంతో సమయం పట్టేదని, తాము పడ్డ కఠిన శ్రమకు తగ్గట్టుగా చిత్రం విజయవంతమయితే తమ కష్టానికి ఫలితం దక్కినట్లేనని అంటున్నాడు హృతిక్‌. ఈ చిత్రంలో హృతిక్‌ సూపర్‌ హీరోగా నటిస్తుండగా, వివేక్‌, కంగనాలు ప్రతినాయకుల పాత్రలో కనిపించనున్నారు.

చిత్ర ప్రచారంలో భాగంగా పలు ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తున్న ట్రైలర్లు ఈ చిత్రం రూపురేఖలను, భారీతనాన్ని చెప్పనే చెప్తున్నాయి. అంతే కాకుండా ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే హృతిక్‌ మెదడుకు శస్త్రచికిత్స జరగడం కూడా చెప్పుకోదగ్గ విషయమే. హృతిక్‌ రోషన్‌ కండల వీరుడిగా, మంచి నృత్య కళాకారుడిగా 'కహోనా ప్యార్‌ హై' చిత్రంతో ప్రేక్షకుల మదిలో ఒక స్ధానం సంపాదించుకున్నప్పటికీ తరువాత విడుదలైన పలు చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకోలేకపోవడంతో పరాజయాలను చవి చూడవలసి వచ్చింది.

అలాంటి పరిస్ధితుల్లో దిగజారిపోతున్న హృతిక్‌ సినీ కెరియర్‌ను నిలబెట్టడానికి రాకేష్‌ రోషన్‌ చేసిన ప్రయత్నమే 'కోయి మిల్‌ గయా'. ఈ చిత్రం నిజంగా ఒక సాహసమే. వయస్సు పెరిగినప్పటికీ మెదడులో ఎదుగుదల లేని ఒక బుద్ధిమాంద్యం ఉన్న పిల్లడి పాత్రలో హృతిక్‌ను ప్రేక్షకులు ఆమోదించడం గొప్ప విషయమే. ఈ చిత్రం సాధించిన విజయోత్సాహంతో రాకేష్‌నే తీసిన మరో చిత్రం 'క్రిష్‌'. విభిన్న కథతో హృతిక్‌ ద్విపాత్రాభినయంతో తెరకెక్కిన ఈ చిత్రానికి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీనికి కొనసాగింపుగా వస్తున్న ప్రస్తుత చిత్రమే క్రిష్‌-3.


ఈ చిత్రంలోని కథతోపాటు గ్రాఫిక్స్‌, కాస్ట్యూమ్స్‌, పోరాట సన్నివేశాలు కూడా హాలీవుడ్‌ స్ధాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని అంటున్నాడు రాకేష్‌ రోషన్‌. అంతే కాకుండా ప్రస్తుతం తమ ఇంట్లోనే ఇద్దరు సూపర్‌ హీరోలు ఉన్నారని వారినే తాను స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి చిత్రాలను తెరకెక్కిస్తున్నాని అంటున్నాడీయన. కేన్సర్‌ వ్యాధితో పోరాడి గెలిచిన తన కూతురుతో పాటు మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకున్న తన కుమారుడు కూడా తన దృష్టిలో సూపర్‌ హీరోలేనని అంటున్నాడు రాకేష్‌.

జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ఒక మనిషి సకారాత్మక ఆలోచనలే గమ్యాన్ని చేర్చుతాయని తాను నమ్మడమే కాకుండా, అదే సిద్ధాంతాన్ని తాను జీవితంలో ఆచరిస్తానని అంటున్నాడు హృతిక్‌. తన సినీ జీవితంలో పెద్దగా విజయాలను నమోదు చేసుకోని వివేక్‌ ఒబెరాయ్‌ ఈ 'క్రిష్‌-3'లో విలన్ పాత్రతో ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తాడో వేచిచూడాల్సిందే.

English summary
Audiences are in for a triple treat with Krrish 3 as India’s Hrithik Roshan, will be seen playing a triple role in the film, that of Rohit (Krrish’s father), Krishna (alter ego of Krrish) and Krrish (the superhero). Hrithik Roshan’s film Krrish 3 will release on November 4, a day after Diwali this year, says filmmaker Rakesh Roshan. “Krrish 3 will finally release on November 4, that is Monday,” said producer-director Rakesh Roshan confirming the final release date of the film for the first time.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu