»   » 'చిరు' ని డైరక్ట్ చేస్తున్న మహేష్ బాబు....

'చిరు' ని డైరక్ట్ చేస్తున్న మహేష్ బాబు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజంగానే చిరంజీవిని మహేష్ బాబు డైరక్ట్ చేస్తున్నాడని ఊహించుకోకండి. 'చిరు' పేరుతో ఓ కన్నడ చిత్రం ప్రారంభమయ్యింది. దానిని మహేష్ బాబు అనే దర్శకుడు డైరక్టర్ రూపొందిస్తున్నాడు. బోణి హీరోయిన్ కృతి కర్భంద ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం ముహూర్తం రీసెంట్ గా హైదరాబాద్ లో హనుమంతనగర్ లోని ఓ దేవస్ధానంలో జరిగింది. ఈ సందర్భంగా కృతి మీడియాతో మాట్లాడుతూ...తను పుట్టింది డిల్లీలో అయినా పెరిగింది బెంగుళూరులోనని అక్కడ తను హీరోయిన్ గా సినిమా ప్రారంభం కావటం ఆమెకు ఆనందాన్నిస్తోందని అంది. ఆలాగే తాను దరిదాపు పదిహేను సంవత్సరాలుగా యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నానని, ఈ చిత్రంతో నయినా సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటానని ఆశిస్తున్నాను అంది. ఇక ఈ చిత్రంలో తన పాత్ర ఓ కాన్ఫిడెంట్ గా ఉండే అమ్మాయి అని, గర్ల్ నెక్ట్స్ డోర్ అన్నట్లుగా ఉంటుందని చెప్పింది. ఈ చిత్రాన్ని సురేష్ జైన్ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోగా తమిళ నటుడు అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా చేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu