»   » వర్మ 'అప్పలరాజు' ప్రీమియర్ షో డిటేల్స్

వర్మ 'అప్పలరాజు' ప్రీమియర్ షో డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పల్రాజు ఈ నెల 18వ తేదీ శుక్రవారం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అంతకుముందు రోజు రాత్రి అంటే 17వ తేదీ రాత్రి ప్రసాద్ మల్టి ప్లెక్స్ లోని అన్ని స్క్రీన్స్ లో ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ మెగా ప్రీమియర్ షో ని ఆర్గనైజ్ చేస్తున్నది కళామందిర్ కళ్యాణ్. ఈ ప్రీమియర్ షో కి ఇండస్ట్రీలోని పెద్దలు, ఆహ్వానితులు మరియు చిత్రంకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ హాజరుకానున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఈ చిత్రం కోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో టాలీవుడ్ లోని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై సెటైర్స్ ఉన్నాయి.

ఇక ఈ చిత్ర కథ ప్రకారం...అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే. ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్‌ వచ్చేసి ఫిల్మ్‌నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే. అప్పల్రాజు పాత్రలో సునీల్‌ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

English summary
‘Katha Screenplay Darsakatwam Appalaraju’, the sensational movie by Ram Gopal Varma is hitting screens on 18th of this month. Kalamandir Kalyan declared that the mega premier show is being organized by Kalamandir on 17th night on all the screens of Prasad’s Multiplex.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu