»   » వర్మ అప్పలరాజు చిత్రం మరోసారి వాయిదా..

వర్మ అప్పలరాజు చిత్రం మరోసారి వాయిదా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అప్పలరాజు' చిత్రం విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మొదట అనుకున్నట్లు ఫిబ్రవరి 4న కాకుండా పిభ్రవరి పదవ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ లో లేటు అవటం వల్ల ఈ చిత్రాన్ని పిభ్రవరి 18 వ తేదీకి వాయిదా వేస్తున్నారు. తెలుగు చిత్రపరిశ్రమపై సెటైర్స్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్, స్వాతి, సాక్షి ఇందులో హిరో హీరోయిన్లు. వందిత కోనేరు సమర్పణలో శ్రేయ నిర్మాణంలో కిరణ్ కుమార్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్ర కథ ప్రకారం...అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే. ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్‌ వచ్చేసి ఫిల్మ్‌నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే. అప్పల్రాజు పాత్రలో సునీల్‌ కనిపిస్తాడు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu