»   » ‘వేదం’ నాగయ్య బిక్షాటన...చలించిన కేటీఆర్

‘వేదం’ నాగయ్య బిక్షాటన...చలించిన కేటీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వేదం సినిమాలో సిరిసిల్ల చేనేత కార్మికుడు రాములగా నటించిన నటుడు నాగయ్య తన పెర్ఫార్మెన్స్‌తో అందరి మనసు దోచుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత నాగయ్యకు అవకాశాలు రాలేదు. ఆర్థిక ఇబ్బందుల పాలైన నాగయ్య ఇటీవల ఫిల్మ్ నగర్లో బిక్షాటన చేస్తున్న విషయం మీడియా కంట పడింది.

ఈ విషయం మీడియాలో రావడంతో విషయం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వరకు వెళ్లింది. పేదరికంతో భిక్షాటన చేస్తున్న వార్తను మీడియాలో చూసి కేటిఅర్ గారు చలించిపోయారు. వెంటనే నాగయ్యను తన ఆఫీస్ కి పిలుపించుకొని మరి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.

KTR Helps Actor Nagaiah

అలాగే మా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ గారితో మాట్లాడి పెన్షన్ కూడా వచ్చే ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని అభయమిచ్చారు. నాగయ్య స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు. కేటీఆర్ సహాయం చేయడంపై పలవురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Telangana Information Technology minister KT Rama Rao showed his softer side yet again by extending financial help to indigent film actor Nagaiah who became famous after he played the role of 'Siricilla Ramulu' in the movie 'Vedam.'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu