»   » పవన్ కల్యాణ్ పేరెత్తగానే ఫ్యాన్స్ ఇలా..: కెటిఆర్ వారెవ్వా అన్నారు

పవన్ కల్యాణ్ పేరెత్తగానే ఫ్యాన్స్ ఇలా..: కెటిఆర్ వారెవ్వా అన్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన ధ్రువ ప్రీ రిలీజింగ్ ఫంక్షన్‌లో ఆదివారంనాడు హైదరాబాదులో తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు ప్రసంగం అందరినీ అకట్టుకుంది.

సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. అరవింద్‌ స్వామి, చరణ్‌ గురించి అన్ని విషయాలు తెలిసినవాడిగానే మాట్లాడారు. కెటిఆర్ సినిమాలు చూసే పద్ధతి ఆయన ప్రసంగం ద్వారా అర్థమైంది.


Photos : చెర్రీ ధృవ పంక్షన్‌లో కెటిఆర్, గంటా


KTR reaction on Pawan kalyan fans emotions

ధృవ సినిమా సక్సెస్‌ మీట్‌ కోసం వైజాగ్‌ కూడా వస్తానన్నారు. అయితే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు ఎత్తినప్పుడు అభిమానుల నుంచి వచ్చిన స్పందన ఆయనను కూడా ఆశ్చర్యపరిచింది. తన ప్రసంగంలో భాగంగా ఆయన పవన్‌కల్యాణ్‌ పేరును ప్రస్తావించారు. చరణ్ తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్ అని ఆయన అన్నారు.


పవన్ కల్యాణ్ పేరు ఎత్తగానే అభిమానుల నుంచి ఒక్కసారిగా అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. పవన్‌ అభిమానుల ఉత్సాహం నింజగానే కెటిఆర్‌ను ఆశ్చర్యపరిచింది. ఆయన రెస్పాన్స్ ఆ విషయాన్ని పట్టిస్తోంది.


KTR reaction on Pawan kalyan fans emotions

అభిమానులు వ్యక్తం చేసిన ఉత్సాహానానికి కెటిఆర్ అనాలోచితంగానే ఒక్కసారిగా 'వారెవ్వా' అన్నారు. నిజానికి ఫంక్షన్‌ మొదలైనప్పటి నుంచి 'పవన్‌, పవన్‌' అని అభిమానులు గోల చేస్తూనే ఉన్నారు అభిమానులు.


అల్లు అరవింద్‌ మాట్లాడుతున్నప్పుడు వారి గోల తారస్థాయికి చేరాయి. దీంతో పవన్‌ కాస్తా బిజీగా ఉండడం వల్ల ఈ ఫంక్షన్‌కు రాలేకపోయాడని, చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ఆడియో ఫంక్షన్‌కు వస్తాడని అరవింద్ చెప్పారు.

English summary
Telangana minister KT Rama Rao reacted to the power star Pawan kalyan fans emotions at Ram Charan Tej's Dhruva cinema function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X