twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మకు 'కుబేర్‌' యజమాని లీగల్‌ నోటీసులు

    By Srikanya
    |

    రాజ్‌కోట్‌: 'అటాక్‌ ఆఫ్‌ 26/11' చిత్రం ఈ రోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదల అపాలని ఇప్పటికే కోర్టు కేసులు నడుస్తున్నాయి. తాజాగా ...కుబేర్‌ పడవ యజమాని హీరాలాల్‌ మసానీ.. సినీదర్శకుడు రాంగోపాల్‌వర్మకు లీగల్‌ నోటీసులు పంపారు. 26/11 దాడులకు ఉగ్రవాదులు ఈ పడవను ఉపయోగించిన సంగతి తెలిసిందే.

    వర్మ తాజా చిత్రం 'అటాక్‌ ఆఫ్‌ 26/11'లో తన పడవ పేరును, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను అనుమతిలేకుండా వినియోగించుకోవడంపై హీరాలాల్‌ ఈమేరకు నోటీసులిచ్చారు. పడవ పేరును ఉపయోగించుకొని తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని.. చిత్ర విడుదలను నిలిపివేయాలని నోటీసులో మసానీ డిమాండ్‌ చేశారు. అయితే గతంలోనే వర్మ మసానీ అనుమతి కోసం ప్రయత్నించినా లభించలేదు.

    2008లో ముంబయ్‌లో జరిగిన తీవ్రవాద దాడుల నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇండస్ ఇన్‌స్పిరేషన్స్ పతాకంపై ఎన్.ఎ.కాంతారావు నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. వర్మ మాట్లాడుతూ....నేను భయపడటమంటే ఈ సినిమా బాగా వస్తుందా లేదా? ప్రేక్షకులకు నచ్చుతుందా అని కాదు. 26/11 దాడుల సమయంలో ప్రత్యక్షంగా అక్కడ ఉన్న పోలీసు అధికారులు, ఇతర బాధితులు నాతో పంచుకొన్న విషయాల్ని నేను సరిగ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతానా లేదా? అనే భయంతో ఈ సినిమా చేశాను అన్నారు. అలాగే ఈ దాడులను ప్రత్యక్షంగా చూసిన బాధితుల తాలూకు ఉద్వేగం చాలా విలువైనది. దాన్ని చెడగొట్టకుండా తెరపైకి తీసుకురావాలనుకొన్నాను అన్నారు.

    అలాగే పది మంది పడవలో నుంచి దిగి రెండు కోట్ల జనాభా ఉన్న ముంబై నగరాన్ని గడగడలాడించడం మామూలు విషయం కాదు. నాలుగేళ్లయినా ఆ దాడుల్ని మనం మరిచిపోలేకపోతున్నాం. అక్కడ ఏం జరిగిందనే విషయం అందరికీ తెలుసు. కానీ ఎలా జరిగిందన్నదే తెలియదు. ఆ రోజు రాత్రి 9:30 గంటల నుంచి ఒంటిగంట వరకు ఏం జరిగిందనే విషయాల్ని కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నమే ఈ సినిమా. తాజ్‌ హోటల్‌లో ఉన్న ఓ మనిషి మనమే అయితే ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపిస్తున్నాం. కసబ్‌ కాల్పులు జరుపుతున్నప్పుడు అతని భావోద్వేగాలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు, ఏ పరిశోధనలోనూ ఆ విషయం తేలదు. కానీ నా వూహాకల్పనతో ఆ భావోద్వేగాల్ని చూపించాను అన్నారు.

    English summary
    Owner of the boat Kuber, which was used in the 26/11 terror attack, has served a legal notice on film director Ram Gopal Verma for having used the boat's name and its registration number in his film Attack of 26/11. The film releases Friday. Stating that Verma should not go ahead with the release of the film, boat owner Hiralal Masani has said in the legal notice, "Registration of Kuber was made at Porbandar port and the film director has used the name and registration number without permission."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X