»   »  దిల్ రాజుకు భారీ లాభాలే తెచ్చిపెట్టిన కుమారి 21ఎఫ్

దిల్ రాజుకు భారీ లాభాలే తెచ్చిపెట్టిన కుమారి 21ఎఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుకుమార్ నిర్మాతగా తెరకెక్కిన స్మాల్ బడ్జెట్ మూవీ ‘కుమారి 21ఎఫ్' బాక్సాఫీసు వద్ద మంచి లాభాలు కొల్లగొడుతోంది. దీంతో నిర్మాతలతో పాటు బయ్యర్లు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా నైజాం రైట్స్ కొనుగోలు చేసిన దిల్ రాజుకు భారీగా లాబాలు వచ్చినట్లు తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మాతగా పలు పెద్ద సినిమాలు సెట్స్ మీద ఉండేవి. అయితే ఈ మధ్య సినిమా నిర్మాణం విషయంలో చాలా స్లో అయ్యాడు రాజు. కారణంగా ఆయన గత ప్రాజెక్టులు కొన్ని నష్టాలను మిగల్చడమే. దీంతో డస్ట్రిబ్యూషన్ రంగంలో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో కుమారి 21ఎఫ్ మూవీని రూ. 25 లక్షల రీఫండబుల్ అడ్వాన్స్ తో రూ. 2.5 కోట్లకు కొనుగోలు చేసారు దిల్ రాజు.

 Kumari 21f giving profits to Dil Raju

సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే దిల్ రాజుకు పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం నాటికి ఆయనకు రూ. 75 లక్షల లాభాలు వచ్చాయి. సినిమా బిజినెస్ పూర్తయ్యే సమయానికి మొత్తం పెట్టుబడికి కనీసం మూడు నాలుగు రెట్లు లాభం వస్తుందని భావిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రానికి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు. రాజ్‌తరుణ్, హేబాపటేల్ జంటగా నటించారు. నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు.

English summary
Dil Raju got Nizam rights of Kumari 21 F for 2.5 crores with a 25 lakhs refundable advance and as per reports the movie is giving him profits already.It is learnt that the movie made about 2.5 crores by end of Monday which puts Dil Raju in a safe point
Please Wait while comments are loading...