»   » ధాంక్స్ చెప్తూ ...దర్శకుడు సుకుమార్

ధాంక్స్ చెప్తూ ...దర్శకుడు సుకుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రాజ్‌ తరుణ్‌, హెబ్బాపటేల్‌ జంటగా కొత్త దర్శకుడు సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కుమారి 21ఎఫ్‌' చిత్ర ఆడియో విడుదలైంది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చిత్ర యూనిట్ సమక్షంలో అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా ఈ ఆడియో విడుదల జరిగింది. ఈ సందర్బంగా ఈ చిత్రం ట్రైరల్ ని విడుదల చేసారు. ఈ ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ధాంక్స్ అని నిర్మాత సుకుమార్ ఫేస్ బుక్ ద్వారా తెలియచేసారు.

Thank You for such an Overwhelming Response! #Kumari21F Theatrical Trailer : https://www.youtube.com/watch?v=0dwU4IfBdI8


Posted by Sukumar B on 1 November 2015

ఆ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.చిత్రం విశేషాలకు వెళ్తే..


కుమారి ఎవరు? 21 ఏళ్ల ఆ అమ్మాయి జీవిత గమనాన్ని మార్చిన సంఘటనలేమిటి? ఓ యువకుడితో ఆమెకు ఏర్పడిన పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది? కుమారి గురించి ఆ యువకుడు తెలుసుకున్న నిజాలేమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు పల్నాటి సూర్యప్రతాప్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం కుమారి 21 ఎఫ్.


ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ, మాటలు, సంభాషణల్ని అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మాతలు. రాజ్‌తరుణ్, హేబాపటేల్ జంటగా నటిస్తున్నారు.


Kumari 21F - Thank You for such an Overwhelming Response!

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. ఓ యువజంట ప్రేమ పయనంలో ఎలాంటి మలుపులు ఎదురయ్యాయి? వారి ప్రేమ చివరకు ఏ తీరాలకు చేరుకుంది? అనే అంశాలు ఆసక్తికరంగా వుంటాయి. ఆద్యంతం సుకుమార్ శైలిలో సాగే చిత్రమిది. దేవిశ్రీప్రసాద్ బాణీలు వినసొంపుగా ఉంటాయి.


ఇటీవలే ఏన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది అన్నారు. నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: రత్నవేలు.English summary
Sukumar shared in fb..."Thank You for such an Overwhelming Response! ‪#‎Kumari21F‬ Theatrical Trailer"
Please Wait while comments are loading...