»   » అర్జున్ 150వ మూవీ ‘కురుక్షేత్రం’ ట్రైలర్

అర్జున్ 150వ మూవీ ‘కురుక్షేత్రం’ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా రూపొందుతోన్న 'కురుక్షేత్రం' టీజర్ రిలీజైంది. రామానాయుడు స్టూడియోలో ఆదివారం జరిగిన టీజర్ రిలీజ్ కార్యక్రమానికి అర్జున్ తో పాటు, దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌, నిర్మాత ఉమేష్ హాజరయ్యారు.

ప్యాషన్‌ స్టూడియోస్‌ సమర్పణలో ఉమేష్‌, సుధాన్‌ సుందరం, జయరాం, అరుణ్‌ వైద్యనాథన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది అర్జున్ కెరీర్లో 150వ చిత్రం కావడి విశేషం. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

హీరో అర్జున్‌ మాట్లాడుతూ - '''జైహింద్‌ 2' తర్వాత హీరోగా చేస్తున్న సినిమా 'కురుక్షేత్రం'. నేను చేస్తున్న 150వ సినిమా. ముందు ఈ చిత్రం నాకు 150వ చిత్రమని తెలియదు. తర్వాత షూటింగ్‌ టైంలో తెలిసింది. నేను సినిమా రంగంలోకి వచ్చి 36 సంవత్సరాలవుతుంది. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్‌ చేసిన దర్శకులకు, నిర్మాతలకు, నటీనటులకు, టెక్నిషియన్స్‌ అందరికీ థాంక్స్‌. నేను ఇప్పటి వరు 20-30 సినిమాల్లో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించాను. కానీ ఆ సినిమాలో లేని ఎలిమెంట్స్‌ కురుక్షేత్రం సినిమాలో చూస్తారు. ప్రతి పోలీస్‌ ఆఫీసర్‌ జీవితంలో మరో కోణం ఉంటుందని తెలియజేసే సినిమా ఇది. ముందు ఈ సినిమా చేయకూడదనే అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత నచ్చడంతో చేశాను. తెలుగు, తమిళం, కన్నడంలో సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఉంటుంది. అరవింద్‌ కృష్ణ సినిమాటోగ్రఫీ, నవీన్‌ సంగీతం సినిమాకు ప్లస్‌ అవుతాయి. మంచి నటీనటులు, టెక్నిషియన్స్‌తో పనిచేశాను. ఈ సినిమాలో ప్రసన్న చాలా కీలక పాత్ర చేశాడు. మంచి డేడికేషన్‌ ఉన్న నటుడు. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా కీ రోల్‌ చేసింది. నిర్మాతలు వ్యాపార దృష్టితో కాకుండా సినిమాను మంచి క్వాలిటీతో నిర్మించారు. డిఫరెంట్‌గా ఉండటమే కాదు. నాకు, తెలుగు ఆడియెన్స్‌కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది'' అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన ఉమేష్‌ మాట్లాడుతూ - ''దర్శకుడు అరుణ్‌గారు యు.ఎస్‌ నుండి మంచి స్క్రిప్ట్‌తో వచ్చి చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా అందరికీ రీచ్‌ కావాలంటే మంచి హీరో కావాలనుకోగానే మాకు అర్జున్‌గారైతే తప్పకుండా న్యాయం చేస్తారనిపించింది. ఇన్వెస్టిగేషన్‌తో పాటు సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, ఎమోషన్స్‌ అన్ని ఉన్న సినిమాగా మెప్పిస్తుంది'' అన్నారు.

English summary
Kurukshetram teaser. directed by Arun Vaidyanathan. produced by Umesh, Sudhan Sundaram, Jayaram & Arun Vaidyanathan. music by S. Navin. starring: Action King Arjun, Prasanna, Varalaxmi, Vaibhav, Sruthi Hariharan, Suman and Suhasini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu